Posts

Showing posts from August, 2021

ఔను నిజం ప్రణయ రథం

Image
ఆ రోజు సాయంత్రం ఇంట్లో అందరం కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాం,హఠాత్తుగా టాపిక్ సినిమాల మీదకు మళ్లింది,ఉన్నట్టుండి మా నాలుగో బాబాయి అడిగాడు "మీలో ఎవరైనా జింబో సినిమా చూశారా?" అనిమేమందరం లేదంటే లేదన్నాం. ఇదంతా ఎప్పుడంటే అబ్బో 1972-73 లో మాట,అప్పుడు నేను బెజవాడ KBN కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతూ వన్ టౌన్ లో మా మూడో బాబాయి గారింట్లో వుంటూ మధ్యలో ఏదో శెలవు రోజున గట్టు వెనక వుంటున్న (బెజవాడలో కనక దుర్గ కొండ వెనక ప్రాంతం) మా నాలుగో బాబాయి గారింటి కొస్తే,అక్కడ జరిగిన ముచ్చట ఇది. ఏవిటీ మూడో బాబాయి,నాలుగో బాబాయి అంటున్నావు?అసలెంతమందీ ఏంకథా ?అనుకుంటున్నారా?చెబుతా నాకు మొత్తం ఆరు బాబాయిలుండేవిలే ,మానాన్న ,పెదనాన్నకాక,ఇప్పుడు మాత్రం ఒక్కటే వుందనుకో! మా ఐదో బాబాయిది అదో తరహా,ఆయన మాటల ధోరణికి మా పిల్లలందరం పడీ,పడీ నవ్వుతూ వుండేవాళ్లం.గులాబీ పువ్వుని"గుల్పాతీ పువ్వు "అనేవాడు," సినిమాలలో వచ్చే సంభాషణలనయితే తమాషాగా నవ్వొచ్చేట్టు మార్చి చెప్పేవాడు"జై పాతాళ భైరవి"అనే దాన్ని "జై తపేళా భైరవి"అనే వాడు,ఇంకా మాయా బజార్లో పద్యాన్ని మార్చి "అటు ఇద్దరు ఇటు ఇద్దరు

కొకైన్ కింగ్ --పాబ్లో ఎస్కొబార్

Image
మనిషి ఆశాజీవి,భవిష్యత్తు మీద ఆశే అతన్ని ముందుకు నడిపే ఇంధనం.అంతేకాదు  జీవితంలో యెన్నో సాధించాలనే కలలు కనడం,ఆ కలలని నిజం చేసుకోవడానికి యెంతో శ్రమించడం ,యెత్తులకి పై యెత్తులు వెయ్యడం, జిత్తులుచెయ్యడం ఇదంతా మనిషి జీవితంలో  ఒక భాగం.కానీ ఆ ఆశ దురాశ కాకూడదు,ఉన్నతంగా జీవించాలని కలలు కనడం తప్పుకాదు కానీ ,ఆ కలలు తీర్చుకోడానికి యెన్నుకునే మార్గాలు సరైనవి కాకపోతే అవే అతని వినాశనానికి కారణమవుతాయి. అందుకే "యెంత విభవము గలిగిన అంతయును ఆపద"అనీ,"దురాశ దుఃఖమునకు చేటు" అనీ పెద్దలు చెప్పిన మాటలు  మరిచి పోగూడదు. అవినూటికి నూరుపాళ్లూ నిజాలని మనకి నిరూపించే ఉదాహరణలుగా కొంత మంది జీవితాలుండటంకూడా ఆశ్చర్యంగా వుంటుంది. అలాంటి జీవితమే కొకైన్ కింగ్  గా పిలవబడే పాబ్లో ఎస్కొబార్ ది.అతను 1980-90సంవత్సరాల మధ్యలో మాదక ద్రవ్యాల మహాసామ్రాజ్యానికి మకుటం లేని రారాజుగా వెలిగిపోయాడు.అమెరికాకు  అక్రమంగా రవాణా అయ్యే  కొకైన్ లో యనభై శాతం ఎస్కోబార్ ద్వారానే సరఫరా అయ్యేది.రోజుకి సుమారు పదిహేను టన్నుల కొకైన్ రవాణా అయ్యేది.ఇలా రవాణా చెయ్యడానికి అతను  142 విమానాలను,20హెలికాప్టర్లను,32యాక్ట్ లు,141ఆఫీసులను,ఇళ్లను

నా అభిమాన సంగీత దర్శకుడు--రోషన్ లాల్ నాగరథ్

Image
హిందీ చిత్రసీమంతా "రోషన్ "అని పిలుచుకునే రోషన్లాల్ నాగరథ్ యెవరని ఇప్పటితరం వాళ్లడిగితే నటుడు రాకేష్ రోషన్ కీ సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ కీ తండ్రీ,యువతరం అంతా వెర్రెక్కి పోయే నటుడు హృతిక్ రోషన్ కి తాతా అని చెప్పవలసి వస్తుంది.1960దశకంలో హిందీ చిత్ర సీమలో ప్రామాణిక మయిన సంగీతానికి చిరునామాగా నిలిచిన దర్శకుడు. అయితే నాకీయన పేరుకూడా తెలీని అజ్ఞానంలో వున్నాను చాలాకాలం.ఉన్నట్టుండి వొకరోజు హఠాత్తుగా నాకీయనే అభిమాన సంగీత దర్శకుడు అనే జ్ఞానం కలిగింది అదెలా అంటే నాకిష్టమయిన హిందీ పాటలన్నీ వరసగా వింటూ సంగీతదర్శకుడెవరా అని చూస్తే ఆ పాటలన్నీ రోషన్ చేసినవే అంతే అమాంతం నేనాయన అభిమానినయిపోయాను మరి అవి యెలాంటి పాటలో మచ్చుకి వొక అరడజను చెపుతా చూడండి. "మన్ రే తూ కాహెన ధీర్ ధరే"--చిత్రలేఖ "అబ్ క్యా మిసాల్ దూ మై తుమారే షబాబ్ కీ"--ఆరతి "దిల్ జోన కహ్ సకా వొహీ రాజ్ దిల్ "--భీగీరాత్ "జిందగీ భర్ నహీ భూలేగీ వో బర్సాత్ కీ రాత్ " -బర్సాత్ కీ రాత్ "ఒహరే తాల్ మిలే నదీకె జల్ మే"--అనోఖీ రాత్ "జోబాత్ తుఝ్ మే హై తెరీ తస్వీర్ మే నహీ "--తాజ్ మహల్ (ఇందు

సమున్నతురాలు శ్రీమతి పి.సత్యవతి

Image
రచయిత్రి గానే కాక వ్యక్తిగా కూడా సమున్నతురాలు శ్రీమతి పి.సత్యవతి. సత్యవతి గారితో నా పరిచయం వయసు సుమారు పదేళ్ల పై మాటేననుకుంటా.అడపా దడపా "రజనీ"(బాలాంత్రపు రాజనీకాంత రావు) గారింట్లో జరిగే సంగీత,సాహిత్య సమావేశాల్లోనూ,ఇంకా ఇతర కామన్ స్నేహితుల ఇళ్లల్లో జరిగే ప్రయివేట్ సమావేశా ల్లోనూ అప్పుడప్పుడూ కనిపిస్తూ వుండేవారు. అప్పటికి ఆవిడ రాసిన "ఇల్లలకగానే" ,"సూపర్ మామ్ సిండ్రోమ్ "లాంటి కథలు చదివే వున్నాను కానీ నిజం చెప్పొద్దూ పెద్దగా పట్టించుకోలేదు. నెమ్మదిగా ఆవిడతో పరిచయం బలపడటమూ,ఈలోగా "దమయంతి కూతురు, సప్తవర్ణ సమ్మిశ్రితం,చీపురు "లాంటి ఆలోచనలు రేకెత్తించే ఆణి ముత్యాల్లాంటి ఆవిడ కథలు చదవడమూ జరిగింది ,దానితో వ్యక్తిగా ఆవిడ మంచితనమూ స్నేహశీలతా,రచయిత్రిగా ఆవిడ విశ్వరూపమూ కొంతవరకూ అవగాహనకు వచ్చాయి. ఇక్కడ ఆవిడ వ్యక్తిత్వం గురించి నాలుగు మాటలు----సాధారణంగా చాలామంది రచయితల రచనలను అభిమానించగలమే గానీ,వారిని నిజజీవితంలో భరించలేము.వారి తల చుట్టూ చక్రాలుంటాయి,వారికి దగ్గరగా కూడా వెళ్లలేం,కానీ సత్యవతి గారితో అలా కాదు,సామాన్యులనుండీ మహా రచయితల దాకా ఆవిడతో కంఫర్టబుల్ గా హాయ

మధుర స్వరలక్ష్మి MS --జీవన సంగీతం

Image
  సం గీతాభిమానులందరూ MS అని పిలుచుకునే మదురై షణ్ముగ వడివు సుబ్బలక్ష్మి కి సొంత బిడ్డలు లేకపోయినా, దేశమంతా మళ్లీ మాటాడితే ప్రపంచమంతా ఆమెని చూడంగానే "అమ్మా "అని పిలవాలనిపించే మూర్తిమత్వంఆవిడది. పవిత్రంగా,ప్రశాంతంగా ,చిరునవ్వుతో వెలిగే వదనం.భారతీయ సంప్రదాయం ఉట్టిపడే కట్టూ,బొట్టూ ఎవరు చూసినా దేశీయులు గానీ,విదేశీయులు గానీ చేయెత్తి నమస్కరించాలనే గానీ వేరే వూహ రానీయని స్వరూపం.ఇక కంఠం విప్పిందా కట్టలు తెంచుకుని లయబధ్ధంగా నర్తించే స్వరాల జలపాతం ఆమె సొంతం. ఆమె సంగీత ప్రతిభ గురించి చర్చించటం ఈ వ్యాసం వుద్దేశం కాకపోయినా నాకా స్థాయి లేకపోయినా చిన్నతనం నుంచీ ఆమె పాటలు వింటూ పెరిగిన దానిగా వొక విషయం చెప్పగలను.ఆమెను పరోక్షంగా కెసెట్లలో ,సిడీలలో వినడం వేరూ ప్రత్యక్షంగా కచేరీలో చూస్తూ వినడం వేరూ.అది వొకఅనుభవం, వొక అదృష్టం. ఆ కచేరీ ఆవరణంతా వొక పవిత్రమయిన "ఆరా" కమ్ముకుంటుంది.పాడుతున్నపుడు ఆమె మొహంలో మెరుపుతో కూడిన ఆత్మానందం కనపడుతుంటే, ఆమె పాట ప్రేక్షకుల హృదయాలను సూటిగా తాకి వేరే లోకాలకు తీసుకెళుతుంది. ఈ అనుభూతి వేరే యే విద్వాంసుని కచేరీలోనూ నేను పొందలేదు.జీవితంలో వొక్క సారయినా ఆ అదృష్

సుస్వర రాణి----జమునారాణి

Image
నా గమల్లి కోన లోన నక్కింది లేడి కూన" అని పాడుతుంటే నరాలు జివ్వున లాగినట్టుంటుంది."మామా మామా మామా "అని పాడుతుంటే ఈ భామను వదిలి పెట్టటం అసాధ్యం అనిపిస్తుంది" ఎంత టక్కరి వాడు నారాజు ఏ మూలనో నక్కినాడు"అంటుంటే ఆ టక్కరి వాణ్ణి పట్టేసిన గజదొంగ సుమా అనిపిస్తుంది. "హైలో హైలేసా హంసకదా నా పడవ"అని పాడుతుంటే ఆ వయ్యారంలో మనం కూడా ఉయ్యాల లూగుతాం. "అందానికి అందం నేనే "అని పాడుతుంటే ఆ కోయిల గళమాధుర్యానికి మనం కూడా పరవశమౌతాం. ఇన్ని అనుభూతులూ కలగజేసేది ఒకే గొంతు ,అదే కె.జమునారాణి గొంతు. జమునా రాణి నా అభిమాన గాయని అని చెప్పాలంటే మొదట్లో కొంచెం ఆలోచించేదాన్ని,ఎందుకంటే సుశీలంటే,జానకంటే,జిక్కీ అంటే,లీల అంటే ,లతా అంటే అభిమానం అని చెప్పేవారుండేవారు,జమునా రాణీ,యల్లారీశ్వరి లని అభిమాన గాయనులుగా చెప్పుకునే వాళ్లు తక్కువ.ఇలా అంటున్నానని వారంటే అభిమానం లేదని కాదు,వారు పాడిన ఎన్నో పాటలని ఇష్టపడతాను నేను,అయితే జమునా రాణి గొంతులో వుండే మిర్చిమసాలా ఘాటూ,తనకే ప్రత్యేకమైన నేసల్ టోన్ తోఆవిడ పాటకి అద్దే అందమూ,ఆమె గొంతులోని కవ్వింపూ , పాడే ప్రతి పాటా అనుభవిస్తూ ఆవిడ పాడే తీరూ ,నన

"సిటిజన్ కేన్ "

Image
 గ త వారంరోజులుగా ఈ ప్రభంజనంలో పడికొట్టుకు పోతున్నాను నేను.ఈ సినిమా 1941లో అమెరికాలో విడుదలయిన దగ్గరనుండీ యీ నాటివరకూ సంచలనాలు సృష్టిస్తూనే వుంది.ఇది చలన చిత్ర ప్రియులూ,శాస్త్ర సాంకేతిక నిపుణులూ ప్రామాణిక పాఠ్యగ్రంథంగా నేటికీ పరిగణిస్తున్న సినిమా.  ఈ సినిమాను నిర్మించి దర్శకత్వంవహించీ,స్క్రీన్ ప్లేలో కూడా భాగస్వామ్యం వహించి,హీరోగా కూడా నటించిన వాడు ఆర్సన్ వెల్స్ .ఇది అతని మొట్టమొదటి సినిమా అప్పటికి అతని వయసు సుమారు 25సం"లు రేడియో కళాకారునిగానూ,రంగస్థల కళాకారునిగానూ వున్న అనుభవమే కానీ సినిమా రంగం లో అనుభవమేమీ లేదు.అతను రేడియో లో హెచ్ .జి.వెల్స్ "వార్ ఆఫ్ ది వరల్డ్స్ " ప్రసారం చేస్తున్నపుడు అందులోని ఆడియో యెఫెక్ట్స్ కి ప్రజలు భయభ్రాంతులయి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చే వారట.ఇక యీ సినిమా విడుదలయిన సం"లో 9విభాగాలలో అకాడమీ అవార్డులకు యెన్నికయ్యి "స్క్రీన్ ప్లే" విభాగంలో అవార్డ్ గెలుచుకుంది .వెల్స్ తో పాటు జె.మాకీలింక్స్  ఈ అవార్డ్ పంచుకున్నాడు.చాలామంది సినీ విశ్లేషకులూ ,అభిమానులూ,చలన చిత్ర చరిత్రకారులూ ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా రాలేదంటారు.అమెరికన్ ఫిల్మ్  ఇన్ స్టిట

నిష్కారణంగా మనుషులిని ప్రేమించే మనిషి

Image
  సి .పి. అంటే తెలీదు .చలసాని ప్రసాద్ కీ,చలసాని ప్రసాద రావుకీ భేదం బొత్తిగా తెలీదు ఇలాంటి అయోమయంలో కాలం గడుపుతూ చలసాని ప్రసాదరావు అంటే ఆర్టిస్టనీ, చలసాని ప్రసాదంటే మార్క్సిస్టనీ తెలుసుకున్న కొద్దిరోజులకే చలసాని ప్రసాదరావు గారు కాలం చేశారు ఇక మిగిలింది కన్ ఫ్యూజన్ లేని వొకే వక్క చలసాని ప్రసాద్ కానీ నాకాయన గురించి తెలిసింది చాలా తక్కువ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త,శ్రీశ్రీ అంటే అభిమానం ఇంతే తెలుసు. ఇలాంటి నేపథ్యంలో సుమారు అయిదారు సంవత్సరాలక్రితం వొకరోజు మనసు ఫౌండేషన్ రాయుడు గారు ఫోన్ చేసి శ్రీశ్రీ సినిమా పాటలు కావాలనీ శ్రీశ్రీ రచనలన్నీ సంకలనాలుగా వేస్తున్నామనీ చెప్పారు  నేను అలాగే నా వద్ద వున్నవి ఇస్తాను అని చెప్పి నా ఫోన్ నంబర్ యెవరిచ్చారని అడిగాను చలసాని ప్రసాద్ గారు యిచ్చారని చెప్పారు ఆయనకు నా ఫోన్ నం"యెలా తెలిసిందో ఈ రోజుకీ నాకు తెలియదు అప్పటికి నేను వి.ఏ.కె. రంగారావు గారి "ఆలాపన " ప్రచురించి వున్నాను కాబట్టి యెవరో యిచ్చి వుంటారనుకున్నాను. తర్వాత కొద్ది కాలానికి చలసాని ప్రసాద్ గారే ఫోన్ చేసి మా యింటికి వస్తున్నానన్నారు యే పార్టీలకూ యే ఇజాలకూ చెందని నాకు ఆయన వస్తున్నారం

అంతర్జాతీయ తార - కబీర్ బేడీ.

Image
క బీర్ బేడీ రాసిన స్వీయచరిత్ర "Stories i must tell" ఇప్పుడే పూర్తి చేశాను.అతను హిందీ చిత్రాలలో నటించాడు,అప్పుడప్పుడూ కొన్ని విదేశీ చిత్రాలలో(జేమ్స్ బాండ్ సినిమా ఆక్టోపస్సీ) నటించాడు,సంచలన మోడల్ ,మరియూ ఒడిస్సీ నృత్య కళాకారిణి ప్రొతిమా బేడీ మాజీ భర్త ,నటి పూజాబేడీ తండ్రీ అనే గానీ పెద్దగా వివరాలు తెలియవు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రొతిమా బేడీ ఆత్మకథ "టైమ్ పాస్ " చదివి చాలా కదిలిపోయాను ,మొహం బద్దలయ్యే నిజాలున్నాయందులో. అందుకే ఇతని ఆటోబయోగ్రఫీ కోరి తెప్పించుకున్నాను అమెజాన్ నుండీ. కబీర్ బేడీ జీవితం రోలర్ కోస్టర్ రైడ్ ను తలపిస్తుంది.అతని తండ్రి బాబాబేడీ పంజాబీ, తల్లి  ఫ్రీదా బ్రిటీష్ వనిత ,ఇద్దరూ ఆక్స్ ఫర్డ్ లో చదువుకునేటప్పుడు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.ఇద్దరివీ బలమైన వ్యక్తిత్వాలే అయినా తల్లిది మరింత బలమైన పర్సనాలిటీ అనిపించింది.వారి పెళ్లి నాటికి స్వతంత్ర సమరం మంచి ఊపులో వుంది, అతని తండ్రి కమ్యూనిస్ట్ భావాలతో దేశం కోసం పోరాడి జైలు పాలయితే తల్లి గాంధీ గారి ఆజ్ఞమేరకు సత్యాగ్రహోద్యమంలో పాలు పంచుకుని జైలు పాలయింది.ఆ తర్వాత వాళ్లిద్దరూ ఆధ్యాత్మిక మార్గంలో పడ్డారు

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ

Image
ఆ గొంతు వింటే "జననాంతర సౌహృదాని" అనే మాట గుర్తొస్తుంది,జన్మజన్మలుగా నేనెరిగిన గొంతు అనిపిస్తుంది.నేనింకా పూర్తిగా కళ్లు తెరవక ముందే  రేడియోలోంచి వచ్చే పాటలలో వినబడి మెత్తగా, మధురంగా వెంటాడిందీ గొంతే అని తెలుసుకున్నది మాత్రం యవ్వనంలో అడుగు పెడుతున్న కొత్తల్లో హిందీ పాటల వెల్లువలో కొట్టుకు పోయేటపుడు ఇదంతా ఇంకెవరి గురించీ గొంతు విప్పితే చాలు వినే వారి మనసులను మధురమయిన లయలో కరిగించి పూలదారులలో  ,తేనె వాకలలో తేలించే మహ్మద్ రఫీ గురించే. ఇక్కడో చిన్న ముచ్చట నా అజ్ఞానం గురించి 9వక్లాసులో వున్నప్పుడనుకుంటా నేనూ,నా స్నేహితురాలూ మాటాడుకుంటూ నీ అభిమాన గాయకుడెవరంటే నీ అభిమాన గాయకుడెవరూ అని ప్రశ్నించుకున్నాం.నా స్నేహితురాలు మహ్మద్ రఫీ పేరు చెప్పింది నేను వెంటనే యేదీ తెలుగులో "ఎంత వారుగానీ వేదాంతులైన గానీ" అని పాడాడేఅయ్యో ఆయనా అని ఆమెను చూసి జాలి పడ్డాను .అప్పుడు తెలియదు నాకు ముందుంది ముసళ్ల పండగ అనీ"రఫీ" అనే మోహ సముద్రంలో నేను మునిగి పోబోతున్నాననీ. నేనూ నాస్నేహితురాలు మృణాళినీ కూడా గాఢమయిన రఫీ అభిమానులం .మేమిద్దరం కలసినపుడు తన చిన్నప్పటి సంఘటన చెప్పుకుని నవ్వుకుంటాం అద