Posts

Showing posts from July, 2022

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

Image
  ఆ గొంతు వింటే "జననాంతర సౌహృదాని" అనే మాట గుర్తొస్తుంది,జన్మజన్మలుగా నేనెరిగిన గొంతు అనిపిస్తుంది.నేనింకా పూర్తిగా కళ్లు తెరవక ముందే రేడియోలోంచి వచ్చే పాటలలో వినబడి మెత్తగా, మధురంగా వెంటాడిందీ గొంతే అని తెలుసుకున్నది మాత్రం యవ్వనంలో అడుగు పెడుతున్న కొత్తల్లో హిందీ పాటల వెల్లువలో కొట్టుకు పోయేటపుడు ఇదంతా ఇంకెవరి గురించీ గొంతు విప్పితే చాలు వినే వారి మనసులను మధురమయిన లయలో కరిగించి పూలదారులలో ,తేనె వాకలలో తేలించే మహ్మద్ రఫీ గురించే ఇక్కడో చిన్న ముచ్చట నా అజ్ఞానం గురించి 9వక్లాసులో వున్నప్పుడనుకుంటా నేనూ,నా స్నేహితురాలూ మాటాడుకుంటూ నీ అభిమాన గాయకుడెవరంటే నీ అభిమాన గాయకుడెవరూ అని ప్రశ్నించుకున్నాం.నా స్నేహితురాలు మహ్మద్ రఫీ పేరు చెప్పింది నేను వెంటనే యేదీ తెలుగులో "ఎంత వారుగానీ వేదాంతులైన గానీ" అని పాడాడేఅయ్యో ఆయనా అని ఆమెను చూసి జాలి పడ్డాను .అప్పుడు తెలియదు నాకు ముందుంది ముసళ్ల పండగ అనీ"రఫీ" అనే మోహ సముద్రంలో నేను మునిగి పోబోతున్నాననీ. నేనూ నాస్నేహితురాలు మృణాళినీ కూడా గాఢమయిన రఫీ అభిమానులం .మేమిద్దరం కలసినపుడు తన చిన్నప్పటి సంఘటన చెప్పుకుని నవ్వుకుంటాం అద

మరణానంతరము

Image
  నేను ఈ నవల 1991 లో విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కొన్నాను.కొన్న వెంటనే చదివేశాను(అప్పట్లో దాదాపు నా దగ్గరున్న పుస్తకాలన్నీ నేను చదివినవే అయి వుండేవి,ఇప్పుడయితే నా కలెక్షన్లో నేను చదవనివి కనీసం వంద పుస్తకాలుండొచ్చు),సెల్ ఫోన్లూ ఫేస్ బుక్ లూ లేని కాలంకదా.నవల చదివిన దగ్గరనుండీ అది నన్ను వెంటాడుతూనే వుంది,ఆ నవల చదివి దాదాపు ముఫ్ఫయ్యేళ్లు దాటినా అది నా జ్ఞాపకాల పుటలనుండీ చెరిగిపోలేదు. ఇంతకీ ఈ పుస్తకం కన్నడం నుండీ తెలుగులోకిఅనువదింపబడింది.కన్నడంలో దాని పేరు "అళిదమేలె",తెలుగులో శ్రీ తిరుమల రామచంద్ర "మరణానంతరము" అనే పేరుతో అనువదించారు.నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 1972 లో ప్రచురించినట్టు వుంది, రచయిత కె.శివరామ కారంత రాసిన ముందు మాట వలన దీని రచనా కాలం 1960 అని తెలుస్తోంది,అంటే కన్నడంలో ప్రచురించ బడిన పన్నెండేళ్లకి NBT వారి అనువాదం వచ్చిందన్న మాట. అరవయ్యేళ్ల క్రితం రాసిన పుస్తకమయినా ,తీసుకున్న కథావస్తువు వలన అది ఎప్పటికయినా చదవడానికి ఉచితమైన పుస్తకమే అనిపిస్తుంది. రచయిత శివరామ కారంత ,ఉత్తమ పురుషలో అంటే తానే కథలో పాత్రధారిగా వుంటూ ,తన గొంతులోనే కథ చెబుతారు---- కారంత గారికి బొంబాయివెళ

విలక్షణ స్వరం---పిఠాపురం

Image
  "అయ్యోయ్యో చేతిలో డబ్బులు పోయెనే జేబులు ఖాళీ ఆయెనే"-----కులగోత్రాలు "మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు."----అవేకళ్లు "సోడా సోడా ఆంధ్రా సోడా గోలీ సోడా జిల్ జిల్ సోడా సోడా తాగు తెలుగోడా చల్లని సోడా,దీని మహిమ చెప్ప లేడు దేవుడు కూడా"-----లక్ష్మీనివాసం "సైకిల్ పై వన్నెలాడి పోతున్నదీ రయ్యిమని పిట్టలాగ పోతున్నది"----పిన్ని "పొరుగింటి మీనాక్షమ్మను చూశారా వాళ్ల ఆయన చేసే ముద్దుముచ్చట విన్నారా"---సంబరాల రాంబాబు "మాయా సంసారం తమ్ముడూ నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడూ"---ఉమా సుందరి "అరె నిసగమపా ఈ లోకం మోసం పమగరిసా"----జయసింహ ఈ పాటలన్నిటిలో వినపడే ఒక ప్రత్యేకమైన గొంతుని గుర్తుపట్టారా?అది పిఠాపురం నాగేశ్వరరావుది. మనకున్న నేపథ్య గాయకులలో విలక్షణమైన, ప్రత్యేకమైన స్వరం పాతర్ల గడ్డ నాగేశ్వరరావుది,ఇలా అంటే యెవ్వరికీ తెలియదు,పిఠాపురం అంటేనే తెలుస్తుంది.ఊరి పేరునే ఇంటి పేరు చేసుకున్న గాయకుడు. నిజానికి యే గొంతు కా గొంతు ప్రత్యేకమైనదే,యే గొంతులో వుండే అందం ఆ గొంతులో వుంటుంది. అయితేఇంతకీ యేమ

జై యన్ .టి.ఆర్

Image
ఏ కోణం నుండీ చూసినా,యే ఫీచర్ చూసినా అందంగానే వుండి ఆకట్టుకునే దివ్యమంగళ విగ్రహం.అలాంటి తీరైన ,ఆకర్షణీయమైన రూపం తెలుగుతెర మీద అంతకు ముందు రాలేదు,ఇకముందు వస్తుందనే ఆశ లేదు.తన కుటుంబంలో కూడా ముందు తరాలలోనూ,ఇప్పటికి వరకూ వచ్చిన వారిలోనూ అంత అందం,ఠీవీ,రాజసం కనరాదు. ఈ పాటికి ఈ ఉపోద్ఘాతమంతా యెవరి గురించో ఊహించే ఉంటారుగా ,ఇంకెవరూ ఈనాడు జన్మించి తెలుగుతెర కథానాయకుడు గానే కాదు,తెలుగుదేశం నాయకుడిగా కూడా వెలిగిన నందమూరి తారకరామారావు గారి గురించే. వీరు మా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో వున్న నిమ్మకూరు లో జన్మించడం వలన ,చిన్నప్పటి నుండీ వీరి కబుర్లు యెవరో ఒకరు చెబుతూ వుండేవారు,పామర్రులో కొన్నాళ్లు నివాసం వున్నారని చెప్పేవారు నిజమెంతో నాకు తెలియదు ఊహ తెలిశాక ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం,అందుకే ఆయన గొప్పతనం కాస్త ఆలస్యంగా తెలిసిందేమో అనుకుంటా. నా జీవితంలో ఆయనను రెండు సార్లు చూసే అవకాశం కలిగింది. నేనప్పుడు యేడో క్లాసు చదువుతున్నాను 1969వ సంవత్సరమనుకుంటా,నేను మా దొడ్లో వున్న జామ చెట్టెక్కి కాయలు కోసుకుంటున్నా యథాప్రకారం(ఇంటి దగ్గర వున్నప్పుడు నా కేరాఫ్ అడ్రస్ అదే ),ఇంతలో యెవరో యం.టీ .రామారావొచ్చాడు మనూరి