Posts

Showing posts from July, 2019

వైవిధ్యమయిన గాయని రాణి

Image
పదీ, పదకొండేళ్ల వయసులో 'దేవదాసు'లో పాడిన పాటల ద్వారా ఆమె  శ్రోతల గుండెల్లో కొలువు తీరిపోయింది. ఎన్నాళ్లు గడిచినా మరవని ఓ మధురిమ మనల్ని  వెన్నాడుతూనే ఉంటుంది. ఆమె తెలుగు చలనచిత్ర  గాయని కె.రాణి. ఆమెది భలే విచిత్రమైన గొంతు. ఘంటసాల గారి చేత 'రాణీ, నీ గొంతులో మిర్చి మసాలా ఘాటు ఉందమ్మారు!' అని అనిపించుకున్న ప్రత్యేకమైన గొంతు ఆమె సొంతం! ఆమెవి కొన్ని పాటలు వింటుంటే జిక్కీ గుర్తొస్తుంది. కొన్ని వింటుంటే పి.లీల పాడారేమో అనిపిస్తుంది. మరికొన్ని పాటల్లో జమునారాణి గుర్తొస్తుంది. అప్పుడప్పుడూ సుశీలలాగానూ అనిపిస్తుంది. అందుకే ఆమె గొంతు గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. చాలామంది ఆమెనీ, జమునారాణినీ కన్‌ఫ్యూజ్‌ అవుతారు. కొంచెం జాగ్రత్తగా వింటే మాత్రం ఆ గొంతులోని విలక్షణత అర్థమవుతుంది. ఆమె గొంతులో విలక్షణత పలికే చక్కని శృతినీ, పెప్‌నీ గమనించిన సంగీత దర్శకులు ఆమెకు చక్కటి అవకాశాలిచ్చారు. అన్ని భాషలూ కలుపుకుని ఆమె సుమారు 500 పాటలు పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలోనే కాకుండా, సింహళ, ఉజ్బెక్‌ భాషల్లోనూ పాడారు. సింహళ భాషలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ఆవిడ పాడిన జా

వెండితెర బంగారం-యస్వీ.రంగారావు

Image
జార్జ్ ఇలియట్ రాసిన " సైలాస్ మార్నర్ "ఇంగ్లీషు నవల ఆధారంగా బి.యన్ .రెడ్డి తీసిన "బంగారు పాప" లో వేషం  లభించడం నటుడు గా యస్వీ.రంగారావుకి లభించిన బంగారు అవకాశం. ఆ బంగారు అవకాశాన్ని బంగారంగా ఉపయోగించుకుని, బంగారమైన నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు పొందాడు యస్వీ.ఆర్ . కేవలం  ’విమర్శకుల’ అని ఎందుకంటున్నానంటే మంచి పేరైతే వచ్చింది గానీ సినిమాకి, వసూళ్ల పరంగా నష్టమే మిగిల్చింది . రంగారావు పరంగా చూస్తే రొటీన్ రొడ్డకొట్టుడు వేషాలకు భిన్నమయినదీ వేషం. ఈ సినిమాలో అనేక షేడ్స్ వున్నాయి. ఇందులో నటించేటపుడు ఉద్వేగానికి గురయ్యే వాణ్ణనీ, తనని తను కంట్రోల్ చేసుకోవడం కష్టమయ్యేదనీ రంగారావే స్వయంగా చెప్పుకున్నట్టు చదివాను. సామాన్య గృహస్థు గా వున్న ఒక మనిషి పరిస్థితుల ప్రభావం వలన కరుడు గట్టిన రౌడీ గా మారతాడు, అలా మారిన రౌడీ అనుకోని పరిస్థితులలో ఒక చిన్న పాపను చేరదీయాలిసి వస్తుంది. ఆ క్రమంలో అతనిలో సాత్త్వికత మొలకెత్తి అంత పెద్ద రౌడీ మామూలు తండ్రిలాగా మారిపోయి పాప బాగోగుల కోసం తపించి పోతాడు. అదీ సినిమాలో కథ. ఈ చిత్రం ఆ యేటి ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డ్ సాధించింది.పాలగుమ్మి  .పద్

"ఏది పత్యం--ఏదపత్యం"

Image
చల్లని గాలి,వర్షంకూడా మొదలయ్యేలా వుంది.ఇలాంటప్పుడే వేడి వేడి గా మిరపకాయ బజ్జీలో,ఉల్లిపాయ పకోడీలో తింటూ ఇష్టమయిన పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్యలో బయట కురిసే వర్షాన్ని చూడటం ఇష్టం కుమారికి.చూడబోతే అత్తగారు వంటింట్లో పకోడీలు వండుతున్నట్టుంది,కమ్మటి వాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడుతోంది,అబ్బ ఎన్నాళ్లయిందో పకోడీలు తిని,కడుపుతో వున్నావనీ,బాలింతరాలవనీ గత తొమ్మిదీ ,పదీ నెలలుగా పత్యపు కూడుతో నోరంతా చవిచచ్చి వుంది ఈ రోజేమయినా పకోడీలు తినాల్సిందే గట్టిగా నిర్ణయించుకుంది.రెండు వారాల పసిబిడ్డ ఏడుపుతో పడగ్గదిలోకి పరుగు తీసింది. కాసేపటికి కుమారి అత్తగారువంటగదిలోంచీ బయటకు వచ్చి ,అందరికీ తలో ప్లేటూ పకోడీలందించి ఆశగా చూస్తున్న కుమారి వేపు తిరిగి "అమ్మాయ్ నువ్వు శెనగపిండి వస్తువులు తినడానికి వీల్లేదుగా పాపం ,పచ్చి బాలింతరాలివి,పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని పదిహేను రోజులు కూడా దాటలేదాయె ,ఆ డబ్బాలో నాన్ రొట్టుంది తిను ,వేడి వేడిగా టీ ఇస్తాలే "అంది.ఇక కుళ్లిపోవడం కుమారి వంతయింది. ఇక్కడ ఇంకో కథ జలుబూ ,జ్వరంతో బాధ పడుతున్న జనార్దన్ కి వేడి వేడి గారెలలో అల్లం పచ్చడి నంచుకు తినాలనుంది,వాళ్లా

పుస్తకాల మనిషి C/O గుంటూరు

Image
ఈయన పేరు లంకా సూర్యనారాయణ.నాకీయన పరిచయం రవికృష్ణ ద్వారా జరిగింది.రవికృష్ణ పరిచయం వి.ఎ.కె. రంగారావు గారిని ఇంటర్వూ చేస్తున్నపుడు జరిగింది.ఇదేదో గొలుసుకట్టు కథలా వుంది కదూ, "ఆలాపన" పుస్తకం  ప్రచురిస్తున్న సందర్భంలో నేనొకసారి గుంటూరు వెళ్లినపుడు రవికృష్ణ కనపడి "మీరు లంకా గారిని వొకసారి కలవాలి కలవదగిన వ్యక్తి" అని తీసికెళ్లాడు. అప్పుడాయన వుంటున్న ఇంటినిండా పుస్తకాలే.నిజం చెప్పాలంటే పుస్తకాల మధ్య యెలాగో చోటు చేసుకుని ఆయన జీవిస్తున్నట్టూ,వాటి మధ్య ఆయన ఇరుక్కు పోయినట్టూ కనపడింది.ఆయన సేకరించిన పుస్తకాలు సుమారు 50 వేలుంటాయి అని చెప్పారు.నేనా పరిస్థితి చూసి"ఏమండీ మీరీ పుస్తకాలన్నీ చదివారా?" అని  ఆశ్చర్యంగా అడిగితే ,ఆయనొక వైరాగ్యమైన నవ్వు నవ్వి"చూడండీ పుస్తకాలు సేకరించడం మొదలు పెడితే చదవటం తగ్గుతుంది" అన్నారు.పుస్తకాలు కొనడం యెంత వ్యసనమో చెబుతూ "బతుకు కల్లుపాక అయిపోతుంది అనుకోండి" అన్నారు.నాకప్పుడు అర్థం కాలా తర్వాత అర్థమయింది .కల్లు తాగడం అలవాటయిన వాడికి కల్లుపాక దగ్గరకి కాళ్లెలా లాగుతాయో పుస్తకాలు కొనడం అలవాటయిన వాడికి పుస్తకాల షాపులకే