Posts

Showing posts with the label డాక్టర్ రొంపిచర్ల భార్గవి

సీమచింత-నా చింత

Image
చింత అంటే కేవలం పులుపనే కాదు,ఆలోచన,కష్టం అనే అర్థాలు కూడా వున్నాయి."మో" అని పిలువబడే వేగుంట మోహన ప్రసాద్ గారి మొట్టమొదటి కావ్యం "చితి--చింత" ప్రఖ్యాత నైరూప్య చిత్రకారులు యస్వీ.రామారావు గారి చిత్రం ,ముఖచిత్రంగా వెలువడింది,పూర్తిగా అర్థమయినా,కాకపోయినా కొనుక్కుని చదివి ,దాచుకున్నా,ఇంకా వుంది నా లైబ్రరీలో. త్యాగరాజస్వామి "తెలిసి రామచింతనతో నామము చేయవే మనసా"----పూర్ణచంద్రిక రాగం "చింతా నాస్తికిలా " సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన,రెండూ బాలమురళీ గొంతులో బాగుంటాయి. "ఆ చింత నీకేలరా స్వామీ నీచెంత నేనుండగా" అనే సినిమా పాట ఈ మధ్య పదే పదే గుర్తొస్తోంది ఎందుకో,ఏ సినిమా లోదా?అని వెదికితే "శుభోదయం"కె.విశ్వనాథ్ గారి సినిమాలో,అయితే కొన్ని పాటలు వింటేనే బాగుంటాయి ,చూసేకంటే ఇది ఆ కోవలోదే ,ఏ మాటకామాటే సుశీల గొంతు ఈ పాటలో  వింటుంటే పాలకోవా తిన్నట్టే వుంటుంది. సరే ఆ చింత సంగతి అక్కడ బెడితే ఈ మధ్య నా నడక దారిలో కనపడే చెట్లను పరిశీలిస్తూ వుండగా,హఠాత్తుగా మా చిన్నప్పుడు కనపడిన కొన్ని చెట్లు ,ఇప్పుడు చాలా వరకూ కనపడటం మానేశాయని తోచింది,వాటిల...

కూలుతున్న కల్పవృక్షం

Image
మా చిన్నప్పుడు తాడి చెట్టుని "ఆంధ్రుల కల్పవృక్షం "అంటారని పాఠాలలో చదువుకున్నాం. దానిలో భాగాలు ఎలా ఉపయోగ పడతాయో బడిలో వ్యాసాలుగా రాశాం, ప్రత్యక్షంగా చూశాం. పెళ్లి పందిళ్లుగా, చల్లని నీడనిచ్చే పాకలుగా, చల్లని గాలినిచ్చే విసనకర్రలుగా, బొమ్మల పెళ్లిళ్ల కోసం తాటాకు బొమ్మలుగా తాడిచెట్టు భాగాలు ఉపయోగ పడేవి.ఇంకా తాటి ముంజలూ, తాటిపళ్లూ, తేగలూ, బుర్రగుంజూ తినడానికి ఉపయోగ పడేవయితే, తాటికల్లు తాగే వాళ్లకి విందు చేస్తుంది. అంతే కాక పంటచేను గట్టు మీద తాటిచెట్లు గట్లని ధృఢంగా పట్టి వుంచుతాయి. రైతుకి ఆదాయానికి ఆదాయం బలానికి బలం. బలం అంటే గుర్తొచ్చింది తాడి చెట్టు చాలాబలమైనది ఒక్క మనిషి దానిని కదిలించడం కష్టం, ఒక సారి నా చిన్నప్పుడు తాటి చెట్టు పీకిన మనిషిని బండిలో ఊరేగించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తాటి చెట్లని ఇప్పుడు కొట్టేస్తున్నారు . కారణం ఏంటని ఆందోళనగా అడినగిన నాకు ఒకాయన చెప్పిన జవాబేంటంటే "ఇప్పుడు తాటాకు ఎవ్వరూ వాడటంలేదు, తాడిచెట్టు ఎక్కి కల్లు గీయాలన్నా కాయలు కొయ్యాలన్నా అందరికీ చేతకాదు.ఆ విద్య వచ్చిన వాళ్లు తగ్గి పోతున్నారు, ఒకవేళ ఎవరినైనా ఎక్కమన్నా ఎక్కినందుకు మనిషికి వంద...