Posts

Showing posts from October, 2020

తెలుగు సాహిత్య రంగంలో వినపడిన శక్తివంతమైన అన్య స్వరం "శారద"

Image
 శక్తివంతమైన అన్య స్వరం అని ఎందుకన్నానంటే 1948-55 ప్రాంతాలలో "శారద" రచనలు ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపాయి,అతను రచనలు చేసింది కొద్దికాలమైనా( సుమారు ఆరేడేళ్లు)అయినా ఒక సంచలనం సృష్టించిన వాడు "శారద" అతని రచనలని ఎన్నదగిన రచయితలయిన నండూరి రామ్మోహన్రావు,ముళ్లపూడి వెంకట రమణ,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి దగ్గర నుండీ సామాన్య తెలుగుపాఠకుడి వరకూ ఆసక్తిగా చదివేవారు ఆరోజుల్లో అంటే అతడెంత శక్తివంతమయిన రచయితో అర్థమవుతుంది. అన్య స్వరం అనడానికి కారణం అతను తెలుగువాడు కాదు తమిళుడు, సుమారు పన్నెండేళ్ల వయసులో పొట్టచేత్తో పట్టుకుని,తండ్రితో పాటు ఉపాథి వెదుక్కుంటూ తమిళనాడు నుండీ తెనాలి వలస వచ్చిన వాడు . అలాంటి వాడు ఒక చెంప దుర్భర దరిద్రం అనుభవిస్తూ ,పస్తులుంటూ,హోటల్లో సర్వరు గానూ,కూలీ గానూ,ఇంకా అనేక చిన్నా చితకా పనులు చేస్తూ,తెలుగు భాష  నేర్చుకుని,ఆ భాషని ప్రేమించి,అందులో రచనలు చేయడం ఎంత గొప్ప విషయం!అవసరం కోసం భాష నేర్చుకునే వారు అనేక మంది వుంటారు కానీ ఆ భాషమీద ప్రేమను పెంచుకునే వారు తక్కువ,ఒక వేళ ఆ భాషంటే ఇష్టం వున్నా, ప్రతిభా వంతమైన రచనలు చేసే వారు  దాదాపు అరుదనే చెప్పాలి. అతని రచనల గు