Posts

Showing posts with the label భార్గవి రోంపిచర్ల

దోసిట చినుకులు

Image
ఎవరైనా ఒక వ్యక్తి ఎదురవగానే  ముందస్తుగానేను  చూసేది ముక్కు.నాకు ముక్కు నచ్చితే మనిషి నచ్చినట్టే.సూటి ముక్కున్న వాళ్లు సూటిగా వ్యవహరిస్తారని కూడా అంటుంటారు కదా?.అలా చక్కటి కను ముక్కు తీరున్న ప్రకాష్ రాజ్ నాకు నచ్చుతాడు,అతని నటన కూడా నచ్చుతుంది.ఏ సినిమాలో నయినా తన పాత్రకు తన పరిథిలో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడనిపిస్తుంది.అతనివి చాలా సినిమాలున్నా ,నాకు బాగా ప్రత్యేకంగా అనిపించేది "నాగమండల "అనే సినిమాలో అతని నటన. అయితే ఒక నటుడి నటనను బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం కదా?బాహ్య సౌందర్యం వున్న వాళ్లందరికీ,అంతః సౌందర్యం వుంటుందనే గ్యారంటీ కూడా లేదు.ఈ మధ్య విజయవాడ పుస్తక మహోత్సవంలో అతను రాసిన వ్యాసాల సంకలనం "దోసిట చినుకులు"కొన్నాను.అది చదివాక అతని ఆలోచనా ధోరణీ,భావజాలం కూడా నచ్చాయి..అతనిది ధృఢమైన వ్యక్తిత్వం అనీ,తగు మాత్రంగా సాహిత్యం కూడా చదివాడనీ,నాటకరంగం అనే బలమైన పునాది కలిగి వున్న వాడనీ అర్థం అయింది. ప్రకృతి గురించీ,మానవుని గురించీ,స్త్రీ గురించీ,తల్లి గురించీ, బిడ్డల గురించీ అతను వెలిబుచ్చిన అభిప్రాయాలు విలువైనవిగా,పరిణతి చెందినవిగా అనిపించాయి. అందమైన...