విషాద నాయిక - మీనాకుమారి
ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీనటి మీనాకుమారికీ వున్న పోలికలు, నట జీవితంలో కానివ్వండీ, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ ఆశ్చర్యమనిపిస్తుంది. ఇద్దరూ తాము నటించిన చిత్రాలలోని పాత్రలతో(1950-60 దశకాలలోని)మధ్య తరగతి కుటుంబ స్త్రీకి నమూనాగా నిలిచారు. ఇద్దరూ ఎక్కువ విషాద చిత్రాల నాయికలుగానే రాణించేవారు. ఇద్దరూ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్ అవసరం లేకుండా(మరీ ఒక్క కంటి నుండే, రెండే కన్నీటి బొట్లు రాల్చడం లాంటి అతిశయోక్తులు కాదు గానీ) కన్నీరు కురిపించ గల సహజ నటీమణులుగా రాణించారు. సంభాషణలు పలకడంలో ఇద్దరికీ మంచి పేరుంది. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కూడా మీనా కుమారి లాగా ఎవరూ డైలాగ్ చెప్పలేరంటారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కూడా మీనా కుమారి ముందు డైలాగ్ చెప్పడానికి జడిసే వాడంటారు .మన సావిత్రి విషయానికొస్తే యస్వీ రంగారావు "అమ్మో సావిత్రి తో నటిస్తున్నాం, జాగ్రత్తగా వుండాలి" అనే వారంటారు కదా! ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ మీనాకుమారి నటన "సాహిబ్ ,బీబీ ఔర్ గులామ్ "లో చూసి" మీనా కుమారి ఉన్నత శ్రేణికి చెందిన నటీమణి "అని ప్రశంశించారంటారు. విచిత్రంగా మీనా కుమ...