Posts

Showing posts from April, 2019

సుస్వరలీల-పి.లీల

Image
ఆమె పాట వింటుంటే ఆమె జన్మతః మళయాళీ అంటే నమ్మబుధ్ధి కాదు , అక్షరాలా మన తెలుగమ్మాయే అనిపిస్తుంది.స్వరమంటారా శాస్త్రీయ సంగీతపు వొదుగు తో ఘనంగా వుంటుంది. క్లాసికల్ టచ్ తో వున్న పాటలకి మాబాగా వొప్పినా, ఆమె పాడిన యే పాటయినా వేరొకరు పాడితే బాగుండేది అనిపించదు పాట యేదయినా నూటికి నూరు పాళ్లూ న్యాయం చేసే సుస్వర నేపథ్య గాయని పొరయత్ .లీల అది ఆమె యింటిపేరు. పుట్టింది కేరళ లోని పాలక్కాడ్ లో మద్రాస్ లో అడుగు పెట్టింది శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకోడానికీ, అందులో రాణించడానికీ దీనికంతా తండ్రిగారి ప్రోత్సాహం పుష్కలంగా వుంది. తొమ్మిదవ యేటనే తొలి సంగీత కచేరీ "ఆంధ్ర మహిళా సభ " లో అప్పటి నుండీ తెలుగు వాళ్లతో అనుబంధం పెనవేసుకుంది అని చెబుతారావిడ. దాదాపు గాయకులందరూ తమని తమిళులు తమిళ దేశం ఆదరించారని చెబుతూ వుంటారు కదా దీనికి విరుధ్ధంగా లీల తనని ఆదరించిందీ,ప్రోత్సహించిందీ,అవకాశాలు యిచ్చిందీ తెలుగు వారే అని చెబుతారు. తర్వాత ఆకాశవాణిలోపాడటం,గ్రామఫోన్ కంపెనీలకు ప్రయివేట్ ఆల్బమ్స్ పాడటం సినీ నేపథ్య గాయనిగా తొలి అడుగులు వేయడానికి తోడ్పడ్డాయి. పరిశ్రమ కొచ్చిన మొదటి రోజుల్లో హెచ్ .ఆర్ .పద్మనాభశాస