Posts

Showing posts from March, 2019

దోసిట చినుకులు

Image
ఎవరైనా ఒక వ్యక్తి ఎదురవగానే  ముందస్తుగానేను  చూసేది ముక్కు.నాకు ముక్కు నచ్చితే మనిషి నచ్చినట్టే.సూటి ముక్కున్న వాళ్లు సూటిగా వ్యవహరిస్తారని కూడా అంటుంటారు కదా?.అలా చక్కటి కను ముక్కు తీరున్న ప్రకాష్ రాజ్ నాకు నచ్చుతాడు,అతని నటన కూడా నచ్చుతుంది.ఏ సినిమాలో నయినా తన పాత్రకు తన పరిథిలో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడనిపిస్తుంది.అతనివి చాలా సినిమాలున్నా ,నాకు బాగా ప్రత్యేకంగా అనిపించేది "నాగమండల "అనే సినిమాలో అతని నటన. అయితే ఒక నటుడి నటనను బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం కదా?బాహ్య సౌందర్యం వున్న వాళ్లందరికీ,అంతః సౌందర్యం వుంటుందనే గ్యారంటీ కూడా లేదు.ఈ మధ్య విజయవాడ పుస్తక మహోత్సవంలో అతను రాసిన వ్యాసాల సంకలనం "దోసిట చినుకులు"కొన్నాను.అది చదివాక అతని ఆలోచనా ధోరణీ,భావజాలం కూడా నచ్చాయి..అతనిది ధృఢమైన వ్యక్తిత్వం అనీ,తగు మాత్రంగా సాహిత్యం కూడా చదివాడనీ,నాటకరంగం అనే బలమైన పునాది కలిగి వున్న వాడనీ అర్థం అయింది. ప్రకృతి గురించీ,మానవుని గురించీ,స్త్రీ గురించీ,తల్లి గురించీ, బిడ్డల గురించీ అతను వెలిబుచ్చిన అభిప్రాయాలు విలువైనవిగా,పరిణతి చెందినవిగా అనిపించాయి. అందమైన

"హెర్పెస్ జోస్టర్ లేక షింగిల్స్ "

Image
  శరీరం మీద ఆ గుల్లలు ఎందుకు వస్తాయి? మంత్రాలు, పసర్లతో తగ్గుతాయా? సురేష్‌కి సర్పి సోకి మూడురోజులయింది. మొహం మీద ఒక పక్కనే సన్నని గుల్లలు బయలు దేరేందుకు ఒకరోజు ముందు ఆ భాగమంతా మంటమంటగా అనిపించింది, వేడిచేసి వుంటుందిలే సగ్గుబియ్యం జావ తాగు తగ్గిపోతుంది అంది వాళ్లమ్మ. రెండో రోజు వచ్చిన ఎర్రని దద్దుర్లు చూసి యేదో కుట్టి అలర్జీ వచ్చి వుంటుందనుకున్నారు. మూడోరోజు చిన్న చిన్న కుప్పలుగా వచ్చిన నీటి గుల్లలు చూసి"అయ్యో ఇది సర్పి అయ్యా మంత్రం పెట్టించుకో తగ్గి పోతుందిలే" అంది పక్కింటి పార్వతమ్మ,ఎవరు పెడతారో కూడా ఆవిడే చెప్పి పుణ్యం కట్టుకుంది.వాళ్లింటికి రెండు వీధుల అవతల వున్న శారదమ్మ ఇందులో ఎక్స్‌పర్ట్ అట,మంత్రం పెట్టాక ఆవిడేదో ఆకుపసరు ఇస్తుందట పైపూతగా పూయడానికి. అయిదు రోజులు మంత్రాలు అయ్యాయి అంటే సర్పి వచ్చి వారం దాటింది. ఆవిడ ఇచ్చిన ఆకు పసరుని ,హారతి కర్పూరం,కొబ్బరి నూనెతో రంగరించి ఆ గుల్లల మీద రాయమంది ,ఇక చూడాలి అసలు గుల్లల వల్ల వచ్చిన మంటకు ఈ కర్పూరం మంట తోడయి ఒళ్లంతా ఒకటే వెర్రిమంటలు.రాత్రుళ్లు నిద్రలేదు.దానికి తోడు ముఖానికి ఒకపక్క వచ్చిన గుల్లలు అటుపక్క కంట్లో గూడా

మా అమ్మ శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ

Image
ఘంటసాల అనే ఈ ఇంటి పేరు చెప్పగానే ,కనీసం పూర్తి పేరు కూడా చెప్పకుండానే తటాలున తెలుగు ప్రజలందరికీ గుర్తువచ్చే సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావుగారు. నేనాయన్ని కనీసం కంటితోనయినా చూడలేదు,కానీ నాకాయన బాగా తెలుసు ,ఎలాగంటారా మా చిన్నతనంలో ప్రతి ఇంటా,ప్రతి గంటా కంచు గంట లాగా మోగుతుండేది ఆయన కంఠం(అంతకాక పోయినా ఇప్పటికీ తరచుగా వినపడే గొంతే ఆయనది లేకపోతే ఆయన పోయి దాదాపు నలభై యేళ్లు దాటుతున్నా ఈ తరానికి చెందిన చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన పాటలు నేర్చుకుని పాడటం జరగదు కదా )అది వింటూ పెరిగిన మేము ఆయనకు   కూడా మరణం వుంటుందనే విషయం మర్చి పోయాం. 1974 ప్రాంతాలలో నేను బెజవాడలో ఇంటర్మీడియట్ చదువుకుంటూ మా బాబాయి గారింట్లో వుండేదాన్ని.పేరుకి వాళ్లింట్లో వుంటున్నానన్న మాటే గానీ,నా కాపరమంతా వాళ్ల మేడ మెట్ల మీదా ,మేడ పైన టెర్రస్ మీదే,ఏదైనా చదువుకోవాలన్నా,స్నేహితులతో కబుర్లాడుకోవాలన్నా అన్నిటికీ అడ్రస్ మేడమెట్లే. అలాంటి రోజుల్లో ఒక సాయంత్రం "ఘంటసాల "ఇక లేరనే వార్త మోసుకొచ్చారెవరో ,ఇక చూడండీ నా సామ్రాజ్యమయిన మేడమెట్లమీద కూర్చుని ఎంత ఏడ్చానో.నేనాయన్నెప్పుడూ చూడలేదు,ఆయనేం మా బంధు

తలనెప్పి---సాధారణమైన జబ్బేనా?

Image
అప్పుడే ఆఫీసు నుండీ ఇంట్లో అడుగు పెట్టిన మూర్తి తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు."అయ్యో ఏమైందండీ"అంది అరుణ గాభరాగా,"ఏంలేదు తలనెప్పి "అన్నాడు మూర్తి."పదండి డాక్టర్ దగ్గరకి వెళదాం"అంటుంటే "వద్దులే,అదే తగ్గిపోతుంది ,మాత్ర వేసుకుంటా "అన్నాడు మూర్తి."లేదండీ,ఈ మధ్య తరచూ ,తలనెప్పి అంటున్నారు" అని బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లింది అరుణ.డాక్టర్ వివరాలన్నీ అడిగి,బి.పి,షుగర్ చెక్ చేసి,తలకి స్కాన్ కూడా తీసి,అది "టెన్షన్ హెడ్ ఏక్ "అనీ పని చేసేచోట వత్తిడి ఎక్కువగా వుండటం,కంప్యూటర్ వాడేటప్పుడు,ఒకే పొజిషన్లో కూచోవడం,అపసవ్య పధ్ధతిలో కూచోవడం ఇవన్నీ కారణమయి వుండవచ్చని వివరించాడు.మందులతో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. వంటింట్లో పోపు పెడుతున్న ప్రియాంకకి ఉన్నట్టుండి ధన ధన మని తలలో సుత్తులతో మోదుతున్నట్టు నెప్పి మొదలయింది.ఈ మధ్య కొన్ని వాసనలు తగిలినప్పుడూ,కొన్ని రకాలయిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడూ తలకు ఒక పక్కనే నెప్పి మొదలయి రెండు మూడు రోజులు నిలబడిపోతోంది,ఏ విధమయిన శబ్దం విన్నా,వెలుతురు చూసినా చికాకుగా వుంటోంది.తలనెప్పిత