Posts

Showing posts with the label Doctor bhargavi

విషాద నాయిక - మీనాకుమారి

Image
ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీనటి మీనాకుమారికీ వున్న పోలికలు, నట జీవితంలో కానివ్వండీ, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ ఆశ్చర్యమనిపిస్తుంది. ఇద్దరూ తాము నటించిన చిత్రాలలోని పాత్రలతో(1950-60 దశకాలలోని)మధ్య తరగతి కుటుంబ స్త్రీకి నమూనాగా నిలిచారు. ఇద్దరూ ఎక్కువ విషాద చిత్రాల నాయికలుగానే రాణించేవారు. ఇద్దరూ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్ అవసరం లేకుండా(మరీ ఒక్క కంటి నుండే, రెండే కన్నీటి బొట్లు రాల్చడం లాంటి అతిశయోక్తులు కాదు గానీ) కన్నీరు కురిపించ గల సహజ నటీమణులుగా రాణించారు. సంభాషణలు పలకడంలో ఇద్దరికీ మంచి పేరుంది. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కూడా మీనా కుమారి లాగా ఎవరూ డైలాగ్ చెప్పలేరంటారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కూడా మీనా కుమారి ముందు డైలాగ్ చెప్పడానికి జడిసే వాడంటారు .మన సావిత్రి విషయానికొస్తే యస్వీ రంగారావు "అమ్మో సావిత్రి తో నటిస్తున్నాం, జాగ్రత్తగా వుండాలి" అనే వారంటారు కదా! ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ మీనాకుమారి నటన "సాహిబ్ ,బీబీ ఔర్  గులామ్ "లో చూసి" మీనా కుమారి ఉన్నత శ్రేణికి చెందిన నటీమణి "అని ప్రశంశించారంటారు. విచిత్రంగా మీనా కుమ...

ఒక భార్గవి పుస్తకం గురించి దర్శకుడు వంశీ

Image
చాన్నాళ్ల నించి నేను రాసుకుంటూ వచ్చిన ఫేస్‌బుక్ పోస్టింగులు ‘‘ఎప్పటి మాట... ఇపుడా మనిషే లేదు’’ అన్న పేరుతో  పుస్తకం వేద్దామనుకున్నాను. Director Vamsy అన్న పేరుగల నా పేజి లో కెళ్ళి తీసిన ప్రింటవుట్స్‌ని పబ్లిషర్ గారికి పంపించేను. రష్యన్ డైరెక్టర్ టార్కవస్కీ సిన్మామీద రాసిన రివ్యూ తప్ప మిగతా ఆర్టికల్స్ అన్నీ బాగున్నాయి కానీ, బుక్ బల్క్‌నెస్ చాలదు. ఇంకా 70  పేజీలు కావాలన్నారా పబ్లిషర్ గారు. ఫ్యాషన్ డిజైనర్ సిన్మా ఫ్లాపయింతర్వాత నించీ నా పేజ్ లో  పోస్ట్‌లు  పెట్టడం మానేసేను. వాళ్లడిగిన ఆ డబ్బై పేజీలూ ఇప్పుడెక్కడ్నించి తేను? అనుకుంటా వుండి పోయిన నాకు మొన్న వేమూరి సత్యంగారు ఫోన్ చేసి.‘‘పామర్రులో ఒక డాక్టర్ గారు   నువ్వు తెద్దా మనుకున్న పుస్తకం కంటే గొప్ప  పుస్తకం తెచ్చేరు. నీక్కూడా కాపీ పంపిస్తారు చూసేక ఫోన్ చెయ్యి’’ అన్నారు. అలా ఆయనలాగన్న నాలుగు రోజులకి  రిజిస్టర్ పోస్ట్‌లో పుస్తకం వచ్చింది. డాక్టర్ భార్గవి గారు రాసిన ఆ పుస్తకం నిజంగా గొప్ప పుస్తకం. పేరు ‘‘ఒక భార్గవి’’ ప్రగతి వారి ప్రింటింగ్ అద్భుతం. గిరిధర్ గౌడ్‌గారి పెయింటింగ్స్ మరీ అద్భుతం ...

తలనెప్పి---సాధారణమైన జబ్బేనా?

Image
అప్పుడే ఆఫీసు నుండీ ఇంట్లో అడుగు పెట్టిన మూర్తి తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు."అయ్యో ఏమైందండీ"అంది అరుణ గాభరాగా,"ఏంలేదు తలనెప్పి "అన్నాడు మూర్తి."పదండి డాక్టర్ దగ్గరకి వెళదాం"అంటుంటే "వద్దులే,అదే తగ్గిపోతుంది ,మాత్ర వేసుకుంటా "అన్నాడు మూర్తి."లేదండీ,ఈ మధ్య తరచూ ,తలనెప్పి అంటున్నారు" అని బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లింది అరుణ.డాక్టర్ వివరాలన్నీ అడిగి,బి.పి,షుగర్ చెక్ చేసి,తలకి స్కాన్ కూడా తీసి,అది "టెన్షన్ హెడ్ ఏక్ "అనీ పని చేసేచోట వత్తిడి ఎక్కువగా వుండటం,కంప్యూటర్ వాడేటప్పుడు,ఒకే పొజిషన్లో కూచోవడం,అపసవ్య పధ్ధతిలో కూచోవడం ఇవన్నీ కారణమయి వుండవచ్చని వివరించాడు.మందులతో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. వంటింట్లో పోపు పెడుతున్న ప్రియాంకకి ఉన్నట్టుండి ధన ధన మని తలలో సుత్తులతో మోదుతున్నట్టు నెప్పి మొదలయింది.ఈ మధ్య కొన్ని వాసనలు తగిలినప్పుడూ,కొన్ని రకాలయిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడూ తలకు ఒక పక్కనే నెప్పి మొదలయి రెండు మూడు రోజులు నిలబడిపోతోంది,ఏ విధమయిన శబ్దం విన్నా,వెలుతురు చూసినా చికాకుగా వుంటోంది.తలనెప్పిత...