Posts

Showing posts with the label #డాక్టర్ గారి సలహాలు#డాక్టర్ భార్గవి రోంపిచర్ల#డాక్టర్ సలహా#సమాజం

తెలుగు సాహిత్య రంగంలో వినపడిన శక్తివంతమైన అన్య స్వరం "శారద"

Image
 శక్తివంతమైన అన్య స్వరం అని ఎందుకన్నానంటే 1948-55 ప్రాంతాలలో "శారద" రచనలు ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపాయి,అతను రచనలు చేసింది కొద్దికాలమైనా( సుమారు ఆరేడేళ్లు)అయినా ఒక సంచలనం సృష్టించిన వాడు "శారద" అతని రచనలని ఎన్నదగిన రచయితలయిన నండూరి రామ్మోహన్రావు,ముళ్లపూడి వెంకట రమణ,తెన్నేటి సూరి,పిలకా గణపతి శాస్త్రి దగ్గర నుండీ సామాన్య తెలుగుపాఠకుడి వరకూ ఆసక్తిగా చదివేవారు ఆరోజుల్లో అంటే అతడెంత శక్తివంతమయిన రచయితో అర్థమవుతుంది. అన్య స్వరం అనడానికి కారణం అతను తెలుగువాడు కాదు తమిళుడు, సుమారు పన్నెండేళ్ల వయసులో పొట్టచేత్తో పట్టుకుని,తండ్రితో పాటు ఉపాథి వెదుక్కుంటూ తమిళనాడు నుండీ తెనాలి వలస వచ్చిన వాడు . అలాంటి వాడు ఒక చెంప దుర్భర దరిద్రం అనుభవిస్తూ ,పస్తులుంటూ,హోటల్లో సర్వరు గానూ,కూలీ గానూ,ఇంకా అనేక చిన్నా చితకా పనులు చేస్తూ,తెలుగు భాష  నేర్చుకుని,ఆ భాషని ప్రేమించి,అందులో రచనలు చేయడం ఎంత గొప్ప విషయం!అవసరం కోసం భాష నేర్చుకునే వారు అనేక మంది వుంటారు కానీ ఆ భాషమీద ప్రేమను పెంచుకునే వారు తక్కువ,ఒక వేళ ఆ భాషంటే ఇష్టం వున్నా, ప్రతిభా వంతమైన రచనలు చేసే వారు  దాదాపు అరుదనే చెప్పాలి. అతని రచనల గు...

చేతులు కడుక్కోవడం - దాని వెనుక చరిత్ర. ఇంకా ఇగ్నోజ్ సెమ్మల్ వీజ్ గురించి విశేషాలు

Image
ఈ రోజు ఒక పక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం, ఇంకో పక్క కరోనా భయంతో వణికి పోతున్నాం. కరోనా ను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అసలు చేతులెలా పరిశుభ్రం చేసుకోవాలి?దానివలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?ఇలా చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే వ్యాథులు దరి చేరకుండా వుంటాయని మొదటగా చెప్పిన మహానుభావుడెవరూ?చివరికాయన జీవితమెలా పరిణమించిందీ?ఒకసారి తెలుసుకుందామా? ప్రతి వ్యక్తీ తన చేతులను సబ్బు తోగానీ,ఇతర డిసిన్ఫెక్టంట్ ద్రావణంతో గానీ రుద్ది,తోమి ,తేటగా వుండే చన్నీళ్లతో గానీ,వేడినీటితో గానీ కడుక్కుని పొడి బట్టతో తుడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేతులు పరిశుభ్రంగా వున్నాయని అర్థం.మామూలుగా నీళ్లతో మాత్రమే కడుక్కుంటే అవి పరిశుభ్రం కావు యే ప్రయోజనమూ వుండదు. అలా శుభ్రం చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు-   చేతులపై వుండే దుమ్మూ,ధూళీతో పాటుజిడ్డూ తో బాటు కంటికి కనపడని అనేక వ్యాథి కారక క్రిములు కూడా తొలగింపబడతాయి, ఆ విధంగా అనేక వ్యాథులు రాకుండా నివారించ వచ్చు. నివారింపబడే వ్యాథులు-   జలుబు (సాధార...