Posts

Showing posts from June, 2019

కూలుతున్న కల్పవృక్షం

Image
మా చిన్నప్పుడు తాడి చెట్టుని "ఆంధ్రుల కల్పవృక్షం "అంటారని పాఠాలలో చదువుకున్నాం. దానిలో భాగాలు ఎలా ఉపయోగ పడతాయో బడిలో వ్యాసాలుగా రాశాం, ప్రత్యక్షంగా చూశాం. పెళ్లి పందిళ్లుగా, చల్లని నీడనిచ్చే పాకలుగా, చల్లని గాలినిచ్చే విసనకర్రలుగా, బొమ్మల పెళ్లిళ్ల కోసం తాటాకు బొమ్మలుగా తాడిచెట్టు భాగాలు ఉపయోగ పడేవి.ఇంకా తాటి ముంజలూ, తాటిపళ్లూ, తేగలూ, బుర్రగుంజూ తినడానికి ఉపయోగ పడేవయితే, తాటికల్లు తాగే వాళ్లకి విందు చేస్తుంది. అంతే కాక పంటచేను గట్టు మీద తాటిచెట్లు గట్లని ధృఢంగా పట్టి వుంచుతాయి. రైతుకి ఆదాయానికి ఆదాయం బలానికి బలం. బలం అంటే గుర్తొచ్చింది తాడి చెట్టు చాలాబలమైనది ఒక్క మనిషి దానిని కదిలించడం కష్టం, ఒక సారి నా చిన్నప్పుడు తాటి చెట్టు పీకిన మనిషిని బండిలో ఊరేగించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తాటి చెట్లని ఇప్పుడు కొట్టేస్తున్నారు . కారణం ఏంటని ఆందోళనగా అడినగిన నాకు ఒకాయన చెప్పిన జవాబేంటంటే "ఇప్పుడు తాటాకు ఎవ్వరూ వాడటంలేదు, తాడిచెట్టు ఎక్కి కల్లు గీయాలన్నా కాయలు కొయ్యాలన్నా అందరికీ చేతకాదు.ఆ విద్య వచ్చిన వాళ్లు తగ్గి పోతున్నారు, ఒకవేళ ఎవరినైనా ఎక్కమన్నా ఎక్కినందుకు మనిషికి వంద

నా కళ్లతో అమెరికా - ఒక యాత్రానుభవం.

Image
మళ్లీ 19 సంవత్సరాల తర్వాత అమెరికా గడ్డ మీద అడుగు పెడతాననుకోలేదు. అదీ సరిగ్గా మళ్లీ వాషింగ్టన్ డి.సి.లోనే.  అసలు ఈ ప్రయాణం గురించిన ఆలోచన ఈ సంవత్సరం మొదట్లోనే కలిగింది. ఎవరైనా ఇద్దరు ముగ్గురు స్నేహితులం అభిరుచులు కలిసిన వాళ్లం కలిసి వెడితే బాగుంటుందనుకున్నా. అలా మాటల్లో ప్రసూనా నేనూ కలిసి వెళదామా అంటే వెళదాం అనుకున్నాం. నేనేమో ఆగస్ట్ తొమ్మిదిన హైద్రాబాద్ వెళ్లి వీసా సాధించుకున్నా మా అమ్మ దయ వలన ఏకంగా పదేళ్లిచ్చేశాడు, మళ్లీ మళ్లీ వాడి గడప తొక్కకుండా. ప్రసూన మధ్యలో కాస్త వెనకడుగు వేసింది, సరే నేనన్నాను నువ్వొచ్చినప్పుడే నేనూ వెళతానని. హఠాత్తుగా ఏప్రిల్ లో అనుకుంటా మే నెలలో వెళదాం నాకు శెలవులు అంది,  మళ్ళీ సరే అంటే సరే అనుకున్నాం. ఈలోగా తనుకూడా వీసా తెచ్చుకుంది. అన్ని ఏర్పాట్లూ చేసుకుని మే పదిహేను తెల్లవారు జామున ఇంటినుండీ బయలు దేరాను వేళ్లు తెంపుకున్న చెట్టులాగ. విజయవాడ లో ప్రసూన ఇంటికి చేరి ఇద్దరం కలిసి వాళ్ల కారులో హైద్రాబాద్ ప్రయాణమయ్యాం. మధ్యలో 7 రెస్టారెంట్ లో నురగతో వున్న ఫిల్టర్ కాఫీ , టిఫిన్ తో సహా కానిచ్చి, ఒక ఫోటో లాగించి,హైద్రాబాద్ లో వాళ్లబ్బాయింటికి తనూ,మా ఫ్రెం

విషాద నాయిక - మీనాకుమారి

Image
ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీనటి మీనాకుమారికీ వున్న పోలికలు, నట జీవితంలో కానివ్వండీ, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ ఆశ్చర్యమనిపిస్తుంది. ఇద్దరూ తాము నటించిన చిత్రాలలోని పాత్రలతో(1950-60 దశకాలలోని)మధ్య తరగతి కుటుంబ స్త్రీకి నమూనాగా నిలిచారు. ఇద్దరూ ఎక్కువ విషాద చిత్రాల నాయికలుగానే రాణించేవారు. ఇద్దరూ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్ అవసరం లేకుండా(మరీ ఒక్క కంటి నుండే, రెండే కన్నీటి బొట్లు రాల్చడం లాంటి అతిశయోక్తులు కాదు గానీ) కన్నీరు కురిపించ గల సహజ నటీమణులుగా రాణించారు. సంభాషణలు పలకడంలో ఇద్దరికీ మంచి పేరుంది. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కూడా మీనా కుమారి లాగా ఎవరూ డైలాగ్ చెప్పలేరంటారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కూడా మీనా కుమారి ముందు డైలాగ్ చెప్పడానికి జడిసే వాడంటారు .మన సావిత్రి విషయానికొస్తే యస్వీ రంగారావు "అమ్మో సావిత్రి తో నటిస్తున్నాం, జాగ్రత్తగా వుండాలి" అనే వారంటారు కదా! ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ మీనాకుమారి నటన "సాహిబ్ ,బీబీ ఔర్  గులామ్ "లో చూసి" మీనా కుమారి ఉన్నత శ్రేణికి చెందిన నటీమణి "అని ప్రశంశించారంటారు. విచిత్రంగా మీనా కుమ