Posts

Showing posts with the label డాక్టర్ భార్గవి రోంపిచర్ల

"ఏది పత్యం--ఏదపత్యం"

Image
చల్లని గాలి,వర్షంకూడా మొదలయ్యేలా వుంది.ఇలాంటప్పుడే వేడి వేడి గా మిరపకాయ బజ్జీలో,ఉల్లిపాయ పకోడీలో తింటూ ఇష్టమయిన పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్యలో బయట కురిసే వర్షాన్ని చూడటం ఇష్టం కుమారికి.చూడబోతే అత్తగారు వంటింట్లో పకోడీలు వండుతున్నట్టుంది,కమ్మటి వాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడుతోంది,అబ్బ ఎన్నాళ్లయిందో పకోడీలు తిని,కడుపుతో వున్నావనీ,బాలింతరాలవనీ గత తొమ్మిదీ ,పదీ నెలలుగా పత్యపు కూడుతో నోరంతా చవిచచ్చి వుంది ఈ రోజేమయినా పకోడీలు తినాల్సిందే గట్టిగా నిర్ణయించుకుంది.రెండు వారాల పసిబిడ్డ ఏడుపుతో పడగ్గదిలోకి పరుగు తీసింది. కాసేపటికి కుమారి అత్తగారువంటగదిలోంచీ బయటకు వచ్చి ,అందరికీ తలో ప్లేటూ పకోడీలందించి ఆశగా చూస్తున్న కుమారి వేపు తిరిగి "అమ్మాయ్ నువ్వు శెనగపిండి వస్తువులు తినడానికి వీల్లేదుగా పాపం ,పచ్చి బాలింతరాలివి,పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని పదిహేను రోజులు కూడా దాటలేదాయె ,ఆ డబ్బాలో నాన్ రొట్టుంది తిను ,వేడి వేడిగా టీ ఇస్తాలే "అంది.ఇక కుళ్లిపోవడం కుమారి వంతయింది. ఇక్కడ ఇంకో కథ జలుబూ ,జ్వరంతో బాధ పడుతున్న జనార్దన్ కి వేడి వేడి గారెలలో అల్లం పచ్చడి నంచుకు తినాలనుంది,వాళ్లా...

పుస్తకాల మనిషి C/O గుంటూరు

Image
ఈయన పేరు లంకా సూర్యనారాయణ.నాకీయన పరిచయం రవికృష్ణ ద్వారా జరిగింది.రవికృష్ణ పరిచయం వి.ఎ.కె. రంగారావు గారిని ఇంటర్వూ చేస్తున్నపుడు జరిగింది.ఇదేదో గొలుసుకట్టు కథలా వుంది కదూ, "ఆలాపన" పుస్తకం  ప్రచురిస్తున్న సందర్భంలో నేనొకసారి గుంటూరు వెళ్లినపుడు రవికృష్ణ కనపడి "మీరు లంకా గారిని వొకసారి కలవాలి కలవదగిన వ్యక్తి" అని తీసికెళ్లాడు. అప్పుడాయన వుంటున్న ఇంటినిండా పుస్తకాలే.నిజం చెప్పాలంటే పుస్తకాల మధ్య యెలాగో చోటు చేసుకుని ఆయన జీవిస్తున్నట్టూ,వాటి మధ్య ఆయన ఇరుక్కు పోయినట్టూ కనపడింది.ఆయన సేకరించిన పుస్తకాలు సుమారు 50 వేలుంటాయి అని చెప్పారు.నేనా పరిస్థితి చూసి"ఏమండీ మీరీ పుస్తకాలన్నీ చదివారా?" అని  ఆశ్చర్యంగా అడిగితే ,ఆయనొక వైరాగ్యమైన నవ్వు నవ్వి"చూడండీ పుస్తకాలు సేకరించడం మొదలు పెడితే చదవటం తగ్గుతుంది" అన్నారు.పుస్తకాలు కొనడం యెంత వ్యసనమో చెబుతూ "బతుకు కల్లుపాక అయిపోతుంది అనుకోండి" అన్నారు.నాకప్పుడు అర్థం కాలా తర్వాత అర్థమయింది .కల్లు తాగడం అలవాటయిన వాడికి కల్లుపాక దగ్గరకి కాళ్లెలా లాగుతాయో పుస్తకాలు కొనడం అలవాటయిన వాడికి పుస్తకాల షాపులకే...

"హెర్పెస్ జోస్టర్ లేక షింగిల్స్ "

Image
  శరీరం మీద ఆ గుల్లలు ఎందుకు వస్తాయి? మంత్రాలు, పసర్లతో తగ్గుతాయా? సురేష్‌కి సర్పి సోకి మూడురోజులయింది. మొహం మీద ఒక పక్కనే సన్నని గుల్లలు బయలు దేరేందుకు ఒకరోజు ముందు ఆ భాగమంతా మంటమంటగా అనిపించింది, వేడిచేసి వుంటుందిలే సగ్గుబియ్యం జావ తాగు తగ్గిపోతుంది అంది వాళ్లమ్మ. రెండో రోజు వచ్చిన ఎర్రని దద్దుర్లు చూసి యేదో కుట్టి అలర్జీ వచ్చి వుంటుందనుకున్నారు. మూడోరోజు చిన్న చిన్న కుప్పలుగా వచ్చిన నీటి గుల్లలు చూసి"అయ్యో ఇది సర్పి అయ్యా మంత్రం పెట్టించుకో తగ్గి పోతుందిలే" అంది పక్కింటి పార్వతమ్మ,ఎవరు పెడతారో కూడా ఆవిడే చెప్పి పుణ్యం కట్టుకుంది.వాళ్లింటికి రెండు వీధుల అవతల వున్న శారదమ్మ ఇందులో ఎక్స్‌పర్ట్ అట,మంత్రం పెట్టాక ఆవిడేదో ఆకుపసరు ఇస్తుందట పైపూతగా పూయడానికి. అయిదు రోజులు మంత్రాలు అయ్యాయి అంటే సర్పి వచ్చి వారం దాటింది. ఆవిడ ఇచ్చిన ఆకు పసరుని ,హారతి కర్పూరం,కొబ్బరి నూనెతో రంగరించి ఆ గుల్లల మీద రాయమంది ,ఇక చూడాలి అసలు గుల్లల వల్ల వచ్చిన మంటకు ఈ కర్పూరం మంట తోడయి ఒళ్లంతా ఒకటే వెర్రిమంటలు.రాత్రుళ్లు నిద్రలేదు.దానికి తోడు ముఖానికి ఒకపక్క వచ్చిన గుల్లలు అటుపక్క కంట్లో గూడా...