Posts

Showing posts from April, 2020

చేతులు కడుక్కోవడం - దాని వెనుక చరిత్ర. ఇంకా ఇగ్నోజ్ సెమ్మల్ వీజ్ గురించి విశేషాలు

Image
ఈ రోజు ఒక పక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం, ఇంకో పక్క కరోనా భయంతో వణికి పోతున్నాం. కరోనా ను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అసలు చేతులెలా పరిశుభ్రం చేసుకోవాలి?దానివలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?ఇలా చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే వ్యాథులు దరి చేరకుండా వుంటాయని మొదటగా చెప్పిన మహానుభావుడెవరూ?చివరికాయన జీవితమెలా పరిణమించిందీ?ఒకసారి తెలుసుకుందామా? ప్రతి వ్యక్తీ తన చేతులను సబ్బు తోగానీ,ఇతర డిసిన్ఫెక్టంట్ ద్రావణంతో గానీ రుద్ది,తోమి ,తేటగా వుండే చన్నీళ్లతో గానీ,వేడినీటితో గానీ కడుక్కుని పొడి బట్టతో తుడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేతులు పరిశుభ్రంగా వున్నాయని అర్థం.మామూలుగా నీళ్లతో మాత్రమే కడుక్కుంటే అవి పరిశుభ్రం కావు యే ప్రయోజనమూ వుండదు. అలా శుభ్రం చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు-   చేతులపై వుండే దుమ్మూ,ధూళీతో పాటుజిడ్డూ తో బాటు కంటికి కనపడని అనేక వ్యాథి కారక క్రిములు కూడా తొలగింపబడతాయి, ఆ విధంగా అనేక వ్యాథులు రాకుండా నివారించ వచ్చు. నివారింపబడే వ్యాథులు-   జలుబు (సాధారణంగా వచ్చ

సీమచింత-నా చింత

Image
చింత అంటే కేవలం పులుపనే కాదు,ఆలోచన,కష్టం అనే అర్థాలు కూడా వున్నాయి."మో" అని పిలువబడే వేగుంట మోహన ప్రసాద్ గారి మొట్టమొదటి కావ్యం "చితి--చింత" ప్రఖ్యాత నైరూప్య చిత్రకారులు యస్వీ.రామారావు గారి చిత్రం ,ముఖచిత్రంగా వెలువడింది,పూర్తిగా అర్థమయినా,కాకపోయినా కొనుక్కుని చదివి ,దాచుకున్నా,ఇంకా వుంది నా లైబ్రరీలో. త్యాగరాజస్వామి "తెలిసి రామచింతనతో నామము చేయవే మనసా"----పూర్ణచంద్రిక రాగం "చింతా నాస్తికిలా " సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన,రెండూ బాలమురళీ గొంతులో బాగుంటాయి. "ఆ చింత నీకేలరా స్వామీ నీచెంత నేనుండగా" అనే సినిమా పాట ఈ మధ్య పదే పదే గుర్తొస్తోంది ఎందుకో,ఏ సినిమా లోదా?అని వెదికితే "శుభోదయం"కె.విశ్వనాథ్ గారి సినిమాలో,అయితే కొన్ని పాటలు వింటేనే బాగుంటాయి ,చూసేకంటే ఇది ఆ కోవలోదే ,ఏ మాటకామాటే సుశీల గొంతు ఈ పాటలో  వింటుంటే పాలకోవా తిన్నట్టే వుంటుంది. సరే ఆ చింత సంగతి అక్కడ బెడితే ఈ మధ్య నా నడక దారిలో కనపడే చెట్లను పరిశీలిస్తూ వుండగా,హఠాత్తుగా మా చిన్నప్పుడు కనపడిన కొన్ని చెట్లు ,ఇప్పుడు చాలా వరకూ కనపడటం మానేశాయని తోచింది,వాటిల