"హెర్పెస్ జోస్టర్ లేక షింగిల్స్ "
శరీరం మీద ఆ గుల్లలు ఎందుకు వస్తాయి? మంత్రాలు, పసర్లతో తగ్గుతాయా? సురేష్‌కి సర్పి సోకి మూడురోజులయింది. మొహం మీద ఒక పక్కనే సన్నని గుల్లలు బయలు దేరేందుకు ఒకరోజు ముందు ఆ భాగమంతా మంటమంటగా అనిపించింది, వేడిచేసి వుంటుందిలే సగ్గుబియ్యం జావ తాగు తగ్గిపోతుంది అంది వాళ్లమ్మ. రెండో రోజు వచ్చిన ఎర్రని దద్దుర్లు చూసి యేదో కుట్టి అలర్జీ వచ్చి వుంటుందనుకున్నారు. మూడోరోజు చిన్న చిన్న కుప్పలుగా వచ్చిన నీటి గుల్లలు చూసి"అయ్యో ఇది సర్పి అయ్యా మంత్రం పెట్టించుకో తగ్గి పోతుందిలే" అంది పక్కింటి పార్వతమ్మ,ఎవరు పెడతారో కూడా ఆవిడే చెప్పి పుణ్యం కట్టుకుంది.వాళ్లింటికి రెండు వీధుల అవతల వున్న శారదమ్మ ఇందులో ఎక్స్‌పర్ట్ అట,మంత్రం పెట్టాక ఆవిడేదో ఆకుపసరు ఇస్తుందట పైపూతగా పూయడానికి. అయిదు రోజులు మంత్రాలు అయ్యాయి అంటే సర్పి వచ్చి వారం దాటింది. ఆవిడ ఇచ్చిన ఆకు పసరుని ,హారతి కర్పూరం,కొబ్బరి నూనెతో రంగరించి ఆ గుల్లల మీద రాయమంది ,ఇక చూడాలి అసలు గుల్లల వల్ల వచ్చిన మంటకు ఈ కర్పూరం మంట తోడయి ఒళ్లంతా ఒకటే వెర్రిమంటలు.రాత్రుళ్లు నిద్రలేదు.దానికి తోడు ముఖానికి ఒకపక్క వచ్చిన గుల్లలు అటుపక్క కంట్లో గూడా...