Posts

Showing posts with the label ఒక భార్గవి

సీమచింత-నా చింత

Image
చింత అంటే కేవలం పులుపనే కాదు,ఆలోచన,కష్టం అనే అర్థాలు కూడా వున్నాయి."మో" అని పిలువబడే వేగుంట మోహన ప్రసాద్ గారి మొట్టమొదటి కావ్యం "చితి--చింత" ప్రఖ్యాత నైరూప్య చిత్రకారులు యస్వీ.రామారావు గారి చిత్రం ,ముఖచిత్రంగా వెలువడింది,పూర్తిగా అర్థమయినా,కాకపోయినా కొనుక్కుని చదివి ,దాచుకున్నా,ఇంకా వుంది నా లైబ్రరీలో. త్యాగరాజస్వామి "తెలిసి రామచింతనతో నామము చేయవే మనసా"----పూర్ణచంద్రిక రాగం "చింతా నాస్తికిలా " సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన,రెండూ బాలమురళీ గొంతులో బాగుంటాయి. "ఆ చింత నీకేలరా స్వామీ నీచెంత నేనుండగా" అనే సినిమా పాట ఈ మధ్య పదే పదే గుర్తొస్తోంది ఎందుకో,ఏ సినిమా లోదా?అని వెదికితే "శుభోదయం"కె.విశ్వనాథ్ గారి సినిమాలో,అయితే కొన్ని పాటలు వింటేనే బాగుంటాయి ,చూసేకంటే ఇది ఆ కోవలోదే ,ఏ మాటకామాటే సుశీల గొంతు ఈ పాటలో  వింటుంటే పాలకోవా తిన్నట్టే వుంటుంది. సరే ఆ చింత సంగతి అక్కడ బెడితే ఈ మధ్య నా నడక దారిలో కనపడే చెట్లను పరిశీలిస్తూ వుండగా,హఠాత్తుగా మా చిన్నప్పుడు కనపడిన కొన్ని చెట్లు ,ఇప్పుడు చాలా వరకూ కనపడటం మానేశాయని తోచింది,వాటిల...

"ఏది పత్యం--ఏదపత్యం"

Image
చల్లని గాలి,వర్షంకూడా మొదలయ్యేలా వుంది.ఇలాంటప్పుడే వేడి వేడి గా మిరపకాయ బజ్జీలో,ఉల్లిపాయ పకోడీలో తింటూ ఇష్టమయిన పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్యలో బయట కురిసే వర్షాన్ని చూడటం ఇష్టం కుమారికి.చూడబోతే అత్తగారు వంటింట్లో పకోడీలు వండుతున్నట్టుంది,కమ్మటి వాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడుతోంది,అబ్బ ఎన్నాళ్లయిందో పకోడీలు తిని,కడుపుతో వున్నావనీ,బాలింతరాలవనీ గత తొమ్మిదీ ,పదీ నెలలుగా పత్యపు కూడుతో నోరంతా చవిచచ్చి వుంది ఈ రోజేమయినా పకోడీలు తినాల్సిందే గట్టిగా నిర్ణయించుకుంది.రెండు వారాల పసిబిడ్డ ఏడుపుతో పడగ్గదిలోకి పరుగు తీసింది. కాసేపటికి కుమారి అత్తగారువంటగదిలోంచీ బయటకు వచ్చి ,అందరికీ తలో ప్లేటూ పకోడీలందించి ఆశగా చూస్తున్న కుమారి వేపు తిరిగి "అమ్మాయ్ నువ్వు శెనగపిండి వస్తువులు తినడానికి వీల్లేదుగా పాపం ,పచ్చి బాలింతరాలివి,పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని పదిహేను రోజులు కూడా దాటలేదాయె ,ఆ డబ్బాలో నాన్ రొట్టుంది తిను ,వేడి వేడిగా టీ ఇస్తాలే "అంది.ఇక కుళ్లిపోవడం కుమారి వంతయింది. ఇక్కడ ఇంకో కథ జలుబూ ,జ్వరంతో బాధ పడుతున్న జనార్దన్ కి వేడి వేడి గారెలలో అల్లం పచ్చడి నంచుకు తినాలనుంది,వాళ్లా...

పుస్తకాల మనిషి C/O గుంటూరు

Image
ఈయన పేరు లంకా సూర్యనారాయణ.నాకీయన పరిచయం రవికృష్ణ ద్వారా జరిగింది.రవికృష్ణ పరిచయం వి.ఎ.కె. రంగారావు గారిని ఇంటర్వూ చేస్తున్నపుడు జరిగింది.ఇదేదో గొలుసుకట్టు కథలా వుంది కదూ, "ఆలాపన" పుస్తకం  ప్రచురిస్తున్న సందర్భంలో నేనొకసారి గుంటూరు వెళ్లినపుడు రవికృష్ణ కనపడి "మీరు లంకా గారిని వొకసారి కలవాలి కలవదగిన వ్యక్తి" అని తీసికెళ్లాడు. అప్పుడాయన వుంటున్న ఇంటినిండా పుస్తకాలే.నిజం చెప్పాలంటే పుస్తకాల మధ్య యెలాగో చోటు చేసుకుని ఆయన జీవిస్తున్నట్టూ,వాటి మధ్య ఆయన ఇరుక్కు పోయినట్టూ కనపడింది.ఆయన సేకరించిన పుస్తకాలు సుమారు 50 వేలుంటాయి అని చెప్పారు.నేనా పరిస్థితి చూసి"ఏమండీ మీరీ పుస్తకాలన్నీ చదివారా?" అని  ఆశ్చర్యంగా అడిగితే ,ఆయనొక వైరాగ్యమైన నవ్వు నవ్వి"చూడండీ పుస్తకాలు సేకరించడం మొదలు పెడితే చదవటం తగ్గుతుంది" అన్నారు.పుస్తకాలు కొనడం యెంత వ్యసనమో చెబుతూ "బతుకు కల్లుపాక అయిపోతుంది అనుకోండి" అన్నారు.నాకప్పుడు అర్థం కాలా తర్వాత అర్థమయింది .కల్లు తాగడం అలవాటయిన వాడికి కల్లుపాక దగ్గరకి కాళ్లెలా లాగుతాయో పుస్తకాలు కొనడం అలవాటయిన వాడికి పుస్తకాల షాపులకే...

కూలుతున్న కల్పవృక్షం

Image
మా చిన్నప్పుడు తాడి చెట్టుని "ఆంధ్రుల కల్పవృక్షం "అంటారని పాఠాలలో చదువుకున్నాం. దానిలో భాగాలు ఎలా ఉపయోగ పడతాయో బడిలో వ్యాసాలుగా రాశాం, ప్రత్యక్షంగా చూశాం. పెళ్లి పందిళ్లుగా, చల్లని నీడనిచ్చే పాకలుగా, చల్లని గాలినిచ్చే విసనకర్రలుగా, బొమ్మల పెళ్లిళ్ల కోసం తాటాకు బొమ్మలుగా తాడిచెట్టు భాగాలు ఉపయోగ పడేవి.ఇంకా తాటి ముంజలూ, తాటిపళ్లూ, తేగలూ, బుర్రగుంజూ తినడానికి ఉపయోగ పడేవయితే, తాటికల్లు తాగే వాళ్లకి విందు చేస్తుంది. అంతే కాక పంటచేను గట్టు మీద తాటిచెట్లు గట్లని ధృఢంగా పట్టి వుంచుతాయి. రైతుకి ఆదాయానికి ఆదాయం బలానికి బలం. బలం అంటే గుర్తొచ్చింది తాడి చెట్టు చాలాబలమైనది ఒక్క మనిషి దానిని కదిలించడం కష్టం, ఒక సారి నా చిన్నప్పుడు తాటి చెట్టు పీకిన మనిషిని బండిలో ఊరేగించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తాటి చెట్లని ఇప్పుడు కొట్టేస్తున్నారు . కారణం ఏంటని ఆందోళనగా అడినగిన నాకు ఒకాయన చెప్పిన జవాబేంటంటే "ఇప్పుడు తాటాకు ఎవ్వరూ వాడటంలేదు, తాడిచెట్టు ఎక్కి కల్లు గీయాలన్నా కాయలు కొయ్యాలన్నా అందరికీ చేతకాదు.ఆ విద్య వచ్చిన వాళ్లు తగ్గి పోతున్నారు, ఒకవేళ ఎవరినైనా ఎక్కమన్నా ఎక్కినందుకు మనిషికి వంద...

విషాద నాయిక - మీనాకుమారి

Image
ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీనటి మీనాకుమారికీ వున్న పోలికలు, నట జీవితంలో కానివ్వండీ, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ ఆశ్చర్యమనిపిస్తుంది. ఇద్దరూ తాము నటించిన చిత్రాలలోని పాత్రలతో(1950-60 దశకాలలోని)మధ్య తరగతి కుటుంబ స్త్రీకి నమూనాగా నిలిచారు. ఇద్దరూ ఎక్కువ విషాద చిత్రాల నాయికలుగానే రాణించేవారు. ఇద్దరూ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్ అవసరం లేకుండా(మరీ ఒక్క కంటి నుండే, రెండే కన్నీటి బొట్లు రాల్చడం లాంటి అతిశయోక్తులు కాదు గానీ) కన్నీరు కురిపించ గల సహజ నటీమణులుగా రాణించారు. సంభాషణలు పలకడంలో ఇద్దరికీ మంచి పేరుంది. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కూడా మీనా కుమారి లాగా ఎవరూ డైలాగ్ చెప్పలేరంటారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కూడా మీనా కుమారి ముందు డైలాగ్ చెప్పడానికి జడిసే వాడంటారు .మన సావిత్రి విషయానికొస్తే యస్వీ రంగారావు "అమ్మో సావిత్రి తో నటిస్తున్నాం, జాగ్రత్తగా వుండాలి" అనే వారంటారు కదా! ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ మీనాకుమారి నటన "సాహిబ్ ,బీబీ ఔర్  గులామ్ "లో చూసి" మీనా కుమారి ఉన్నత శ్రేణికి చెందిన నటీమణి "అని ప్రశంశించారంటారు. విచిత్రంగా మీనా కుమ...

తలనెప్పి---సాధారణమైన జబ్బేనా?

Image
అప్పుడే ఆఫీసు నుండీ ఇంట్లో అడుగు పెట్టిన మూర్తి తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు."అయ్యో ఏమైందండీ"అంది అరుణ గాభరాగా,"ఏంలేదు తలనెప్పి "అన్నాడు మూర్తి."పదండి డాక్టర్ దగ్గరకి వెళదాం"అంటుంటే "వద్దులే,అదే తగ్గిపోతుంది ,మాత్ర వేసుకుంటా "అన్నాడు మూర్తి."లేదండీ,ఈ మధ్య తరచూ ,తలనెప్పి అంటున్నారు" అని బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లింది అరుణ.డాక్టర్ వివరాలన్నీ అడిగి,బి.పి,షుగర్ చెక్ చేసి,తలకి స్కాన్ కూడా తీసి,అది "టెన్షన్ హెడ్ ఏక్ "అనీ పని చేసేచోట వత్తిడి ఎక్కువగా వుండటం,కంప్యూటర్ వాడేటప్పుడు,ఒకే పొజిషన్లో కూచోవడం,అపసవ్య పధ్ధతిలో కూచోవడం ఇవన్నీ కారణమయి వుండవచ్చని వివరించాడు.మందులతో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. వంటింట్లో పోపు పెడుతున్న ప్రియాంకకి ఉన్నట్టుండి ధన ధన మని తలలో సుత్తులతో మోదుతున్నట్టు నెప్పి మొదలయింది.ఈ మధ్య కొన్ని వాసనలు తగిలినప్పుడూ,కొన్ని రకాలయిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడూ తలకు ఒక పక్కనే నెప్పి మొదలయి రెండు మూడు రోజులు నిలబడిపోతోంది,ఏ విధమయిన శబ్దం విన్నా,వెలుతురు చూసినా చికాకుగా వుంటోంది.తలనెప్పిత...