Posts

Showing posts from October, 2019

స్వరభాస్వరం-యల్లారీశ్వరం

Image
ఈ భాస్వరానికి, సూరేకారం లాంటి జ్యోతిలక్ష్మి నృత్యమూ ,గంధకం లాంటి పాట రచనా తోడైందంటే ఇక వేరే చెప్పాలా మహాప్రభో!  సినిమా పాటల తూటాలు సీమటపాకాయల్లా పేలతాయి,మనుషులను వెర్రెక్కిస్తాయి. మ్మత్తయిన,గమ్మత్తయిన ,కైపెక్కే, అదోమాదిరిగా అనిపించే పాటలు పాడటంలో ఆరితేరిన గాయని యల్లారీశ్వరి,అయితే ఆమె ఇలాంటి మాదకత నిండిన పాటలేనా?మాధుర్యం ఒలికేవీ,ఇంకా మిగతా రకాల పాటలేవీ పాడలేదా ? అని అనుమానిస్తే మనం పప్పులో కాలేసినట్టే. ఆమె అన్ని రకాల పాటలూ పాడింది,అందులో మాధుర్య ప్రధానమైనవీ,యుగళ గీతాలూ,చిన్న పిల్లలికి పాడినవీ(బాలభారతం),భక్తి గీతాలు,కమెడియన్స్ కి పాడినవీ అన్నీ ఉన్నాయి.ఆవిడ పాడిన హిందూ,క్రిస్టియన్ భక్తి గీతాల ఆల్బమ్స్ తమిళనాట చాలా పాప్యులర్ అని విన్నాను. మాధుర్య ప్రధానమైనపాటల విషయానికొస్తే సుశీల ఆమెలాగా పాడలేరేమో కానీ,ఆవిడ సుశీల లాగా పాడగలరు ,"గాలిలోన పైటచెంగు గంతులేసేనెందుకో" (ప్రతిజ్ఞాపాలన) పాట విని అది సుశీల పాడిందనుకునే దాన్ని చాలాకాలం,తర్వాత ఈమె పాడిందని తెలుసుకుని చాలా ఆశ్చర్య పోయాను. అయితే ఆమె గొంతులో వినపడే ప్రత్యేకమైన   వైబ్రేషన్స్ కి శృంగారగీతాలూ, క్లబ్ సాంగ్సూ ,జానపద గీతాలూ బ

భారతీయ చలనచిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్.

Image
నా అభిమాన దర్శకుడూ, నా అబ్సెషన్ గురుదత్ .ఇటువంటి అక్టోబర్ నెలలోనే  పదవతేదీ 1964 సంవత్సరంలో ఈ లోకంతో నాకేమి పని అని నిష్క్రమించాడు  .అది హిందీ చిత్రసీమకు అత్యంత విషాదకరమయిన రోజు గురుదత్ ఎవరని ఈ తరం ప్రేక్షకులడిగితే యేంచెప్పాలి.కేవలం అతనొక నిర్మాత,దర్శకుడూ, కొరియోగ్రాఫర్ అని చెపితే చాలదు.అతను పని చేసిన పదమూడు సం"రాలలో తీసిన సినిమాల సంఖ్య యాభై లోపే అయినా "క్లాసిక్స్ "అనదగిన చిత్రాలు తీశాడు. 1951లో "బాజీ"తో చిత్రరంగ ప్రవేశం చేసి 1964లో తనువు చాలించే వరకూ గడచిన పదమూడేళ్లలో హిందీ చిత్రరంగాన్ని ఒక కుదుపు కుదిపాడు,ఒక కొత్త ఒరవడి సృష్టించాడు.అందుకే ఈనాటికీ అతని చిత్రాలు చిత్ర సీమలో ప్రవేశించే విద్యార్థులకు పాఠాలు గానూ,స్ఫూర్తిగానూ నిలుస్తున్నాయి.కొంతమంది అతనిని "ఇండియన్ ఆర్సన్ వెల్స్ "అంటారు .అతని సినిమాలలో"ప్యాసా","సాహిబ్,బీబీ,అవుర్ గులామ్ "టైమ్ మాగజీన్ ఎన్నుకున్న "వంద ఉత్తమ ప్రపంచ చిత్రాలు" జాబితాలో చేరాయంటే అతని ప్రతిభను గురించి వేరే చెప్పాలా?  అయితే ఒక విషయం అతని సినిమాలలో కమర్షియల్ విలువలు లేవా? అంటే వున్నాయి .నాకేమని