Posts

Showing posts from September, 2022

ఒంటరి------ప్రకృతి లోకి ఒక ప్రయాణం

Image
సమస్త ప్రాణికోటితో నిండిన ,అనేక రకాలయిన జంతువులున్న ఈ చరాచర ప్రపంచంలో మనిషి కూడా ఒక రకమయిన జంతువే.భాషనేర్చిన జంతువు మనిషి అంటారు కొందరు.ఇక్కడ కూడా నాదొక పేచీ---జంతువులకు కూడా వాటి భాష వాటికుందేమో మనకేం తెలుసు? ఆది కాలంలో ప్రకృతికి దగ్గరగా దానిలో ఒక భాగమై,అందులోని ప్రాణికోటితో సావాసం చేస్తూ,ఒక సమతౌల్యం సాధించి జీవనం సాగించేవాడు మనిషి.జంతువులతో పాటు మందలు మందలుగా జీవించడానికి అలవాటు పడిన అతను నెమ్మదిగా నాగరికతను అలవరచుకుని,నగరాలు నిర్మించుకుని ప్రకృతికి దూరమయ్యాడు.శారీరక శ్రమ చేసి ఆహారం సంపాదించడం కంటే,శరీరాన్నేక్కువ కష్టపెట్టకుండా సులువుగా ఆహారాన్ని సంపాదించడమే కాక ,ప్రకృతి భీభత్సాలకు తట్టుకుని ,భద్రతగా భద్రతగా జీవించడానికి అనేక ఉపాయాలు నేర్చాడు. ఈ పరిణామ క్రమంలో తనను తను కోల్పోతున్నాడు.సహజాతంగా తనకు సంక్రమించిన ఇన్ స్టింక్ట్స్ ని కోల్పోవడంతోబాటు ,ప్రకృతి ప్రసాదించే అలౌకికానందాన్ని జారవిడుచుకుంటున్నాడు.శారీరకంగా,మానసికంగా బలహీనుడయ్యి వింత,వింత వ్యాధుల బారిన పడుతున్నాడు ఇలాంటి భావజాలంతో,ఈ విషయాలన్నీ ఈ తరం వారికి చెబుతూ-----ప్రకృతిని కాపాడుకుంటే మనను మనం కాపాడుకున్నట్టే అని చెప్పడం ఈ రచన

ఐదుకాళ్ల మనిషి...

Image
మా చిన్నప్పుడు మా ఊరి నిండా చెరువులే.  రాళ్లభండి వారి చెరువూ, గంగానమ్మ గుడి చెరువూ, నడిచెరువూ, కోటిరెడ్డి చెరువూ, వీరభద్రయ్య చెరువూ ,చాకలి చెరువూ, చెక్కోడి చెరువూ, మంగలి గుంట ,ఒడ్డోడి గుంట ఇన్నోటి చెరువులుండేవి.  మంచినీళ్లకయినా ,బట్టలుతుక్కోడానికయినా ,పశువులని కడగడానికయినా ,ఇతరత్రా యే పనికయినా చెరువునీళ్లే ఎన్ని చెరువులున్నా తాగడానికి మాత్రం నడిచెరువు నీళ్లే ఆధారం.అందుకనే ఆ చెరువు కట్ట చుట్టూ కాపలా వుండేది .ఈ రేవులో బట్టలు ఉతక రాదు,పశువులను కడగ రాదు అనే బోర్డులు కూడా వుండేవి. పొద్దున్నే మొదలయి పగలు పది గంటల వరకూ చెరువు రేవు దగ్గర సందడిగా ,ఉత్సవంలా వుండేది ,నీళ్లబిందెలతో వచ్చే ఆడవాళ్లతో,కావిళ్లతో వచ్చే మొగవాళ్లతోనూ. ఆడవాళ్లు కొంతమంది బిందెలను భుజం మీద మోస్తే ,ఇంకొంతమంది నడుంమీద పెట్టుకుని ఒకచెయ్యి బిందెని చుట్టి ఇంకోచెయ్యి జాడిస్తూ వయ్యారంగా నడిచే వారు.మొగవాళ్లయితే కావడి ఒక భుజం మీద గానీ ,రెండు భుజాల మీద కానీ మోస్తూ ఒక ఊపుతో నడిచే వాళ్లు ,వాళ్ల బిందెల నుండీ తుళ్లి పడిన నీళ్ల జాలు కూడా రోడ్డుమీద ఒక తిన్నని గీత గీసినట్టు పడటం మా బోటి పిల్లకాయల కెంతో ఆశ్చర్యం గొలిపేది ఆ తర్వాత కాలంలోనే ,పం

వేణుగానం వీనులవిందుగా వినిపించిన మాస్టర్ వేణు!

Image
d వేణుగానమ్ము వినిపించెనే చిన్నికృష్ణయ్య కనిపించడే "వేణు " దోరవయసున్న కన్నియల హృదయాలనూ దోచుకున్నాడని విన్నాను చాడీలనూ అంతమొనగాడటే వట్టి కథలేనటే ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే "వేణు  " మన్ను తిన్నాడని యశోదమ్మ అడిగిందటా లేదు లేదంటూ లోకాలె చూపాడట అంత మొనగాడటే వింత కథలేనటే ఏది కనపడితే చూడాలి కనులారా వానినే "వేణు " దుడుకు కృష్ణయ్య మడుగు లోన దూకాడట జడిసి వ్రేపల్లె ప్రజలంతా మూగారట ఘల్లు ఘల్ ఘల్లన వొళ్లు ఝల్ ఝల్లన తాను ఫణిరాజు పడగ పై తారంగ మాడేనట "వేణు " గత పది రోజులుగా యీ పాట నన్ను వెంటాడి వేటాడి వేధించుకు తింటోందంటే నమ్మండి యీ పాట రచన ఆత్రేయ పాడినది సుశీల ,జిక్కి, జానకి నటించినది సావిత్రి,వాసంతి బిఏ(ఆవిడ పేరు అలాగే వేసుకునే వారు ) గిరిజ ముగ్గురూ నవ లావణ్యంతో మెరిసి పోతుంటారు ముఖ్యంగా గిరిజ యెంత ముద్దుగా వుందో! చిత్రం "సిరి సంపదలు " పద్మశ్రీ పిక్చర్స్ పతాకం కింద పీపులయ్య,అని పిలవబడే పి. పుల్లయ్యనిర్మంచి దర్శకత్వం వహించారు. సంగీతం నిర్వహించిన మాస్టర్ వేణు ప్రతిభ గురించి వేరే చెప్పక్కరలేదు . ప్రతి చరణం చివరి వాక్యం లో పలికించిన సంగతులు వింటే

వి. ఎ. కె. అంటే?

Image
  అసలు వి. ఎ. కె. అంటే ఏమిటండీ?’ ఇది నేను చేసిన ఇంటర్‌వ్యూలో రంగారావుగారిని అడిగిన మొదటి ప్రశ్న. దానికాయన ‘వేంకట ఆనంద కుమార కృష్ణరంగారావు, అందులో ఆనంద్ అనేదే నా పేరు. మిగతావన్నీ ఏవో దేవుళ్ల పేర్లు. రంగారావు షేర్‌ఖాన్ మా పెద్దల కిచ్చిన బిరుదు’ అన్నారు. నేనేదో తమాషా చేయబోయి ‘మేం అలా అనుకోవట్లేదే’ అన్నాను. ‘మీరెలా అనుకున్నా సరే అదే నిజం, అదే నిలుస్తుంది’ అన్నారు. అసలు నా దృష్టిలో వి. ఎ. కె. రంగారావంటే వివిధ విషయాలపై  వి శేషమైన  అ వగాహన  క లవారు అని. రంగారావుగారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. ఆయనలో ఒక రచయిత, కాలమిస్ట్, రికార్డ్ కలెక్టర్, డాన్సర్, జంతు ప్రేమికుడు, సినీ సంగీత సాహిత్య విశ్లేషకుడు, చతుర సంభాషణా దురంధరుడు, పదాలూ జావళీలూ మీద పట్టున్నవాడు – ఇంతమంది కొలువుదీరి వున్నారు. ఆయనొక విజ్ఞాన ఖని: అనేక అంశాలపైన అభిరుచీ అభినివేశం వున్నది. కొన్ని అంశాలలో విశేషమైన ప్రతిభ, లోతైన అవగాహనా వున్నాయి. పాత తెలుగు, హిందీ సినిమాల గురించి, పాటల గురించీ సాధికారంగా చెప్పగలిగిన వ్యక్తి రంగారావుగారొక్కరే. ఈ విషయంలో ఆయన మాట ప్రామాణికం, శిలాశాసనం. రాజముద్ర పడిపోయినట్టే. నండూరి రామ్మోహనరావుగారి లాంటి ప్రముఖుడు కూడా య