Posts

స్వరభాస్వరం-యల్లారీశ్వరం

Image
ఈ భాస్వరానికి, సూరేకారం లాంటి జ్యోతిలక్ష్మి నృత్యమూ ,గంధకం లాంటి పాట రచనా తోడైందంటే ఇక వేరే చెప్పాలా మహాప్రభో!  సినిమా పాటల తూటాలు సీమటపాకాయల్లా పేలతాయి,మనుషులను వెర్రెక్కిస్తాయి. మ్మత్తయిన,గమ్మత్తయిన ,కైపెక్కే, అదోమాదిరిగా అనిపించే పాటలు పాడటంలో ఆరితేరిన గాయని యల్లారీశ్వరి,అయితే ఆమె ఇలాంటి మాదకత నిండిన పాటలేనా?మాధుర్యం ఒలికేవీ,ఇంకా మిగతా రకాల పాటలేవీ పాడలేదా ? అని అనుమానిస్తే మనం పప్పులో కాలేసినట్టే. ఆమె అన్ని రకాల పాటలూ పాడింది,అందులో మాధుర్య ప్రధానమైనవీ,యుగళ గీతాలూ,చిన్న పిల్లలికి పాడినవీ(బాలభారతం),భక్తి గీతాలు,కమెడియన్స్ కి పాడినవీ అన్నీ ఉన్నాయి.ఆవిడ పాడిన హిందూ,క్రిస్టియన్ భక్తి గీతాల ఆల్బమ్స్ తమిళనాట చాలా పాప్యులర్ అని విన్నాను. మాధుర్య ప్రధానమైనపాటల విషయానికొస్తే సుశీల ఆమెలాగా పాడలేరేమో కానీ,ఆవిడ సుశీల లాగా పాడగలరు ,"గాలిలోన పైటచెంగు గంతులేసేనెందుకో" (ప్రతిజ్ఞాపాలన) పాట విని అది సుశీల పాడిందనుకునే దాన్ని చాలాకాలం,తర్వాత ఈమె పాడిందని తెలుసుకుని చాలా ఆశ్చర్య పోయాను. అయితే ఆమె గొంతులో వినపడే ప్రత్యేకమైన   వైబ్రేషన్స్ కి శృంగారగీతాలూ, క్లబ్ సాంగ్సూ ,జానపద గీతా...

భారతీయ చలనచిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్.

Image
నా అభిమాన దర్శకుడూ, నా అబ్సెషన్ గురుదత్ .ఇటువంటి అక్టోబర్ నెలలోనే  పదవతేదీ 1964 సంవత్సరంలో ఈ లోకంతో నాకేమి పని అని నిష్క్రమించాడు  .అది హిందీ చిత్రసీమకు అత్యంత విషాదకరమయిన రోజు గురుదత్ ఎవరని ఈ తరం ప్రేక్షకులడిగితే యేంచెప్పాలి.కేవలం అతనొక నిర్మాత,దర్శకుడూ, కొరియోగ్రాఫర్ అని చెపితే చాలదు.అతను పని చేసిన పదమూడు సం"రాలలో తీసిన సినిమాల సంఖ్య యాభై లోపే అయినా "క్లాసిక్స్ "అనదగిన చిత్రాలు తీశాడు. 1951లో "బాజీ"తో చిత్రరంగ ప్రవేశం చేసి 1964లో తనువు చాలించే వరకూ గడచిన పదమూడేళ్లలో హిందీ చిత్రరంగాన్ని ఒక కుదుపు కుదిపాడు,ఒక కొత్త ఒరవడి సృష్టించాడు.అందుకే ఈనాటికీ అతని చిత్రాలు చిత్ర సీమలో ప్రవేశించే విద్యార్థులకు పాఠాలు గానూ,స్ఫూర్తిగానూ నిలుస్తున్నాయి.కొంతమంది అతనిని "ఇండియన్ ఆర్సన్ వెల్స్ "అంటారు .అతని సినిమాలలో"ప్యాసా","సాహిబ్,బీబీ,అవుర్ గులామ్ "టైమ్ మాగజీన్ ఎన్నుకున్న "వంద ఉత్తమ ప్రపంచ చిత్రాలు" జాబితాలో చేరాయంటే అతని ప్రతిభను గురించి వేరే చెప్పాలా?  అయితే ఒక విషయం అతని సినిమాలలో కమర్షియల్ విలువలు లేవా? అంటే వున్నాయి .నాకేమని...

వైవిధ్యమయిన గాయని రాణి

Image
పదీ, పదకొండేళ్ల వయసులో 'దేవదాసు'లో పాడిన పాటల ద్వారా ఆమె  శ్రోతల గుండెల్లో కొలువు తీరిపోయింది. ఎన్నాళ్లు గడిచినా మరవని ఓ మధురిమ మనల్ని  వెన్నాడుతూనే ఉంటుంది. ఆమె తెలుగు చలనచిత్ర  గాయని కె.రాణి. ఆమెది భలే విచిత్రమైన గొంతు. ఘంటసాల గారి చేత 'రాణీ, నీ గొంతులో మిర్చి మసాలా ఘాటు ఉందమ్మారు!' అని అనిపించుకున్న ప్రత్యేకమైన గొంతు ఆమె సొంతం! ఆమెవి కొన్ని పాటలు వింటుంటే జిక్కీ గుర్తొస్తుంది. కొన్ని వింటుంటే పి.లీల పాడారేమో అనిపిస్తుంది. మరికొన్ని పాటల్లో జమునారాణి గుర్తొస్తుంది. అప్పుడప్పుడూ సుశీలలాగానూ అనిపిస్తుంది. అందుకే ఆమె గొంతు గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. చాలామంది ఆమెనీ, జమునారాణినీ కన్‌ఫ్యూజ్‌ అవుతారు. కొంచెం జాగ్రత్తగా వింటే మాత్రం ఆ గొంతులోని విలక్షణత అర్థమవుతుంది. ఆమె గొంతులో విలక్షణత పలికే చక్కని శృతినీ, పెప్‌నీ గమనించిన సంగీత దర్శకులు ఆమెకు చక్కటి అవకాశాలిచ్చారు. అన్ని భాషలూ కలుపుకుని ఆమె సుమారు 500 పాటలు పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలోనే కాకుండా, సింహళ, ఉజ్బెక్‌ భాషల్లోనూ పాడారు. సింహళ భాషలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ఆవిడ పాడిన జా...

వెండితెర బంగారం-యస్వీ.రంగారావు

Image
జార్జ్ ఇలియట్ రాసిన " సైలాస్ మార్నర్ "ఇంగ్లీషు నవల ఆధారంగా బి.యన్ .రెడ్డి తీసిన "బంగారు పాప" లో వేషం  లభించడం నటుడు గా యస్వీ.రంగారావుకి లభించిన బంగారు అవకాశం. ఆ బంగారు అవకాశాన్ని బంగారంగా ఉపయోగించుకుని, బంగారమైన నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు పొందాడు యస్వీ.ఆర్ . కేవలం  ’విమర్శకుల’ అని ఎందుకంటున్నానంటే మంచి పేరైతే వచ్చింది గానీ సినిమాకి, వసూళ్ల పరంగా నష్టమే మిగిల్చింది . రంగారావు పరంగా చూస్తే రొటీన్ రొడ్డకొట్టుడు వేషాలకు భిన్నమయినదీ వేషం. ఈ సినిమాలో అనేక షేడ్స్ వున్నాయి. ఇందులో నటించేటపుడు ఉద్వేగానికి గురయ్యే వాణ్ణనీ, తనని తను కంట్రోల్ చేసుకోవడం కష్టమయ్యేదనీ రంగారావే స్వయంగా చెప్పుకున్నట్టు చదివాను. సామాన్య గృహస్థు గా వున్న ఒక మనిషి పరిస్థితుల ప్రభావం వలన కరుడు గట్టిన రౌడీ గా మారతాడు, అలా మారిన రౌడీ అనుకోని పరిస్థితులలో ఒక చిన్న పాపను చేరదీయాలిసి వస్తుంది. ఆ క్రమంలో అతనిలో సాత్త్వికత మొలకెత్తి అంత పెద్ద రౌడీ మామూలు తండ్రిలాగా మారిపోయి పాప బాగోగుల కోసం తపించి పోతాడు. అదీ సినిమాలో కథ. ఈ చిత్రం ఆ యేటి ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డ్ సాధించింది.పాలగుమ్మి  .పద్...

"ఏది పత్యం--ఏదపత్యం"

Image
చల్లని గాలి,వర్షంకూడా మొదలయ్యేలా వుంది.ఇలాంటప్పుడే వేడి వేడి గా మిరపకాయ బజ్జీలో,ఉల్లిపాయ పకోడీలో తింటూ ఇష్టమయిన పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్యలో బయట కురిసే వర్షాన్ని చూడటం ఇష్టం కుమారికి.చూడబోతే అత్తగారు వంటింట్లో పకోడీలు వండుతున్నట్టుంది,కమ్మటి వాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడుతోంది,అబ్బ ఎన్నాళ్లయిందో పకోడీలు తిని,కడుపుతో వున్నావనీ,బాలింతరాలవనీ గత తొమ్మిదీ ,పదీ నెలలుగా పత్యపు కూడుతో నోరంతా చవిచచ్చి వుంది ఈ రోజేమయినా పకోడీలు తినాల్సిందే గట్టిగా నిర్ణయించుకుంది.రెండు వారాల పసిబిడ్డ ఏడుపుతో పడగ్గదిలోకి పరుగు తీసింది. కాసేపటికి కుమారి అత్తగారువంటగదిలోంచీ బయటకు వచ్చి ,అందరికీ తలో ప్లేటూ పకోడీలందించి ఆశగా చూస్తున్న కుమారి వేపు తిరిగి "అమ్మాయ్ నువ్వు శెనగపిండి వస్తువులు తినడానికి వీల్లేదుగా పాపం ,పచ్చి బాలింతరాలివి,పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని పదిహేను రోజులు కూడా దాటలేదాయె ,ఆ డబ్బాలో నాన్ రొట్టుంది తిను ,వేడి వేడిగా టీ ఇస్తాలే "అంది.ఇక కుళ్లిపోవడం కుమారి వంతయింది. ఇక్కడ ఇంకో కథ జలుబూ ,జ్వరంతో బాధ పడుతున్న జనార్దన్ కి వేడి వేడి గారెలలో అల్లం పచ్చడి నంచుకు తినాలనుంది,వాళ్లా...

పుస్తకాల మనిషి C/O గుంటూరు

Image
ఈయన పేరు లంకా సూర్యనారాయణ.నాకీయన పరిచయం రవికృష్ణ ద్వారా జరిగింది.రవికృష్ణ పరిచయం వి.ఎ.కె. రంగారావు గారిని ఇంటర్వూ చేస్తున్నపుడు జరిగింది.ఇదేదో గొలుసుకట్టు కథలా వుంది కదూ, "ఆలాపన" పుస్తకం  ప్రచురిస్తున్న సందర్భంలో నేనొకసారి గుంటూరు వెళ్లినపుడు రవికృష్ణ కనపడి "మీరు లంకా గారిని వొకసారి కలవాలి కలవదగిన వ్యక్తి" అని తీసికెళ్లాడు. అప్పుడాయన వుంటున్న ఇంటినిండా పుస్తకాలే.నిజం చెప్పాలంటే పుస్తకాల మధ్య యెలాగో చోటు చేసుకుని ఆయన జీవిస్తున్నట్టూ,వాటి మధ్య ఆయన ఇరుక్కు పోయినట్టూ కనపడింది.ఆయన సేకరించిన పుస్తకాలు సుమారు 50 వేలుంటాయి అని చెప్పారు.నేనా పరిస్థితి చూసి"ఏమండీ మీరీ పుస్తకాలన్నీ చదివారా?" అని  ఆశ్చర్యంగా అడిగితే ,ఆయనొక వైరాగ్యమైన నవ్వు నవ్వి"చూడండీ పుస్తకాలు సేకరించడం మొదలు పెడితే చదవటం తగ్గుతుంది" అన్నారు.పుస్తకాలు కొనడం యెంత వ్యసనమో చెబుతూ "బతుకు కల్లుపాక అయిపోతుంది అనుకోండి" అన్నారు.నాకప్పుడు అర్థం కాలా తర్వాత అర్థమయింది .కల్లు తాగడం అలవాటయిన వాడికి కల్లుపాక దగ్గరకి కాళ్లెలా లాగుతాయో పుస్తకాలు కొనడం అలవాటయిన వాడికి పుస్తకాల షాపులకే...

కూలుతున్న కల్పవృక్షం

Image
మా చిన్నప్పుడు తాడి చెట్టుని "ఆంధ్రుల కల్పవృక్షం "అంటారని పాఠాలలో చదువుకున్నాం. దానిలో భాగాలు ఎలా ఉపయోగ పడతాయో బడిలో వ్యాసాలుగా రాశాం, ప్రత్యక్షంగా చూశాం. పెళ్లి పందిళ్లుగా, చల్లని నీడనిచ్చే పాకలుగా, చల్లని గాలినిచ్చే విసనకర్రలుగా, బొమ్మల పెళ్లిళ్ల కోసం తాటాకు బొమ్మలుగా తాడిచెట్టు భాగాలు ఉపయోగ పడేవి.ఇంకా తాటి ముంజలూ, తాటిపళ్లూ, తేగలూ, బుర్రగుంజూ తినడానికి ఉపయోగ పడేవయితే, తాటికల్లు తాగే వాళ్లకి విందు చేస్తుంది. అంతే కాక పంటచేను గట్టు మీద తాటిచెట్లు గట్లని ధృఢంగా పట్టి వుంచుతాయి. రైతుకి ఆదాయానికి ఆదాయం బలానికి బలం. బలం అంటే గుర్తొచ్చింది తాడి చెట్టు చాలాబలమైనది ఒక్క మనిషి దానిని కదిలించడం కష్టం, ఒక సారి నా చిన్నప్పుడు తాటి చెట్టు పీకిన మనిషిని బండిలో ఊరేగించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తాటి చెట్లని ఇప్పుడు కొట్టేస్తున్నారు . కారణం ఏంటని ఆందోళనగా అడినగిన నాకు ఒకాయన చెప్పిన జవాబేంటంటే "ఇప్పుడు తాటాకు ఎవ్వరూ వాడటంలేదు, తాడిచెట్టు ఎక్కి కల్లు గీయాలన్నా కాయలు కొయ్యాలన్నా అందరికీ చేతకాదు.ఆ విద్య వచ్చిన వాళ్లు తగ్గి పోతున్నారు, ఒకవేళ ఎవరినైనా ఎక్కమన్నా ఎక్కినందుకు మనిషికి వంద...