Posts

కూలుతున్న కల్పవృక్షం

Image
మా చిన్నప్పుడు తాడి చెట్టుని "ఆంధ్రుల కల్పవృక్షం "అంటారని పాఠాలలో చదువుకున్నాం. దానిలో భాగాలు ఎలా ఉపయోగ పడతాయో బడిలో వ్యాసాలుగా రాశాం, ప్రత్యక్షంగా చూశాం. పెళ్లి పందిళ్లుగా, చల్లని నీడనిచ్చే పాకలుగా, చల్లని గాలినిచ్చే విసనకర్రలుగా, బొమ్మల పెళ్లిళ్ల కోసం తాటాకు బొమ్మలుగా తాడిచెట్టు భాగాలు ఉపయోగ పడేవి.ఇంకా తాటి ముంజలూ, తాటిపళ్లూ, తేగలూ, బుర్రగుంజూ తినడానికి ఉపయోగ పడేవయితే, తాటికల్లు తాగే వాళ్లకి విందు చేస్తుంది. అంతే కాక పంటచేను గట్టు మీద తాటిచెట్లు గట్లని ధృఢంగా పట్టి వుంచుతాయి. రైతుకి ఆదాయానికి ఆదాయం బలానికి బలం. బలం అంటే గుర్తొచ్చింది తాడి చెట్టు చాలాబలమైనది ఒక్క మనిషి దానిని కదిలించడం కష్టం, ఒక సారి నా చిన్నప్పుడు తాటి చెట్టు పీకిన మనిషిని బండిలో ఊరేగించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తాటి చెట్లని ఇప్పుడు కొట్టేస్తున్నారు . కారణం ఏంటని ఆందోళనగా అడినగిన నాకు ఒకాయన చెప్పిన జవాబేంటంటే "ఇప్పుడు తాటాకు ఎవ్వరూ వాడటంలేదు, తాడిచెట్టు ఎక్కి కల్లు గీయాలన్నా కాయలు కొయ్యాలన్నా అందరికీ చేతకాదు.ఆ విద్య వచ్చిన వాళ్లు తగ్గి పోతున్నారు, ఒకవేళ ఎవరినైనా ఎక్కమన్నా ఎక్కినందుకు మనిషికి వంద...

నా కళ్లతో అమెరికా - ఒక యాత్రానుభవం.

Image
మళ్లీ 19 సంవత్సరాల తర్వాత అమెరికా గడ్డ మీద అడుగు పెడతాననుకోలేదు. అదీ సరిగ్గా మళ్లీ వాషింగ్టన్ డి.సి.లోనే.  అసలు ఈ ప్రయాణం గురించిన ఆలోచన ఈ సంవత్సరం మొదట్లోనే కలిగింది. ఎవరైనా ఇద్దరు ముగ్గురు స్నేహితులం అభిరుచులు కలిసిన వాళ్లం కలిసి వెడితే బాగుంటుందనుకున్నా. అలా మాటల్లో ప్రసూనా నేనూ కలిసి వెళదామా అంటే వెళదాం అనుకున్నాం. నేనేమో ఆగస్ట్ తొమ్మిదిన హైద్రాబాద్ వెళ్లి వీసా సాధించుకున్నా మా అమ్మ దయ వలన ఏకంగా పదేళ్లిచ్చేశాడు, మళ్లీ మళ్లీ వాడి గడప తొక్కకుండా. ప్రసూన మధ్యలో కాస్త వెనకడుగు వేసింది, సరే నేనన్నాను నువ్వొచ్చినప్పుడే నేనూ వెళతానని. హఠాత్తుగా ఏప్రిల్ లో అనుకుంటా మే నెలలో వెళదాం నాకు శెలవులు అంది,  మళ్ళీ సరే అంటే సరే అనుకున్నాం. ఈలోగా తనుకూడా వీసా తెచ్చుకుంది. అన్ని ఏర్పాట్లూ చేసుకుని మే పదిహేను తెల్లవారు జామున ఇంటినుండీ బయలు దేరాను వేళ్లు తెంపుకున్న చెట్టులాగ. విజయవాడ లో ప్రసూన ఇంటికి చేరి ఇద్దరం కలిసి వాళ్ల కారులో హైద్రాబాద్ ప్రయాణమయ్యాం. మధ్యలో 7 రెస్టారెంట్ లో నురగతో వున్న ఫిల్టర్ కాఫీ , టిఫిన్ తో సహా కానిచ్చి, ఒక ఫోటో లాగించి,హైద్రాబాద్ లో వాళ్లబ్బాయింటికి తనూ...

విషాద నాయిక - మీనాకుమారి

Image
ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీనటి మీనాకుమారికీ వున్న పోలికలు, నట జీవితంలో కానివ్వండీ, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ ఆశ్చర్యమనిపిస్తుంది. ఇద్దరూ తాము నటించిన చిత్రాలలోని పాత్రలతో(1950-60 దశకాలలోని)మధ్య తరగతి కుటుంబ స్త్రీకి నమూనాగా నిలిచారు. ఇద్దరూ ఎక్కువ విషాద చిత్రాల నాయికలుగానే రాణించేవారు. ఇద్దరూ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్ అవసరం లేకుండా(మరీ ఒక్క కంటి నుండే, రెండే కన్నీటి బొట్లు రాల్చడం లాంటి అతిశయోక్తులు కాదు గానీ) కన్నీరు కురిపించ గల సహజ నటీమణులుగా రాణించారు. సంభాషణలు పలకడంలో ఇద్దరికీ మంచి పేరుంది. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కూడా మీనా కుమారి లాగా ఎవరూ డైలాగ్ చెప్పలేరంటారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కూడా మీనా కుమారి ముందు డైలాగ్ చెప్పడానికి జడిసే వాడంటారు .మన సావిత్రి విషయానికొస్తే యస్వీ రంగారావు "అమ్మో సావిత్రి తో నటిస్తున్నాం, జాగ్రత్తగా వుండాలి" అనే వారంటారు కదా! ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ మీనాకుమారి నటన "సాహిబ్ ,బీబీ ఔర్  గులామ్ "లో చూసి" మీనా కుమారి ఉన్నత శ్రేణికి చెందిన నటీమణి "అని ప్రశంశించారంటారు. విచిత్రంగా మీనా కుమ...

ఒక భార్గవి పుస్తకం గురించి దర్శకుడు వంశీ

Image
చాన్నాళ్ల నించి నేను రాసుకుంటూ వచ్చిన ఫేస్‌బుక్ పోస్టింగులు ‘‘ఎప్పటి మాట... ఇపుడా మనిషే లేదు’’ అన్న పేరుతో  పుస్తకం వేద్దామనుకున్నాను. Director Vamsy అన్న పేరుగల నా పేజి లో కెళ్ళి తీసిన ప్రింటవుట్స్‌ని పబ్లిషర్ గారికి పంపించేను. రష్యన్ డైరెక్టర్ టార్కవస్కీ సిన్మామీద రాసిన రివ్యూ తప్ప మిగతా ఆర్టికల్స్ అన్నీ బాగున్నాయి కానీ, బుక్ బల్క్‌నెస్ చాలదు. ఇంకా 70  పేజీలు కావాలన్నారా పబ్లిషర్ గారు. ఫ్యాషన్ డిజైనర్ సిన్మా ఫ్లాపయింతర్వాత నించీ నా పేజ్ లో  పోస్ట్‌లు  పెట్టడం మానేసేను. వాళ్లడిగిన ఆ డబ్బై పేజీలూ ఇప్పుడెక్కడ్నించి తేను? అనుకుంటా వుండి పోయిన నాకు మొన్న వేమూరి సత్యంగారు ఫోన్ చేసి.‘‘పామర్రులో ఒక డాక్టర్ గారు   నువ్వు తెద్దా మనుకున్న పుస్తకం కంటే గొప్ప  పుస్తకం తెచ్చేరు. నీక్కూడా కాపీ పంపిస్తారు చూసేక ఫోన్ చెయ్యి’’ అన్నారు. అలా ఆయనలాగన్న నాలుగు రోజులకి  రిజిస్టర్ పోస్ట్‌లో పుస్తకం వచ్చింది. డాక్టర్ భార్గవి గారు రాసిన ఆ పుస్తకం నిజంగా గొప్ప పుస్తకం. పేరు ‘‘ఒక భార్గవి’’ ప్రగతి వారి ప్రింటింగ్ అద్భుతం. గిరిధర్ గౌడ్‌గారి పెయింటింగ్స్ మరీ అద్భుతం ...

మా మద్రాసు తాతయ్య

Image
అయిన వాళ్లూ,దగ్గర బంధువులూ ఆయన్ని పిలిచే పేరు ఆనంద్ . పరివారమూ , పరిజనమూ పెదనాయన అంటారు. స్నేహితులూ, దగ్గరగా తెలిసిన వాళ్లూ"చిక్కీ "అంటుంటారు. పాఠకులకీ, పై వాళ్లకీ తెలిసిన పేరు వే.ఆ.కృ.రంగారావు లేక వి.ఎ.కె .రంగారావు. కానీ దగ్గర పరిచయస్తులకీ ,తను అభిమానించే వాళ్లకీ, తనను అభిమానించే వాళ్లకీ---ఆయనే కోరి పిలిపించుకునే పేరు తీరు "మద్రాస్ తాతయ్య" చిన్నతనం నుండీ పత్రికలలో ఆయన వ్యాసాలు,(ముఖ్యంగా విజయచిత్రలో) చదివి చాలా ఆశ్చర్య పడుతూ వుండే దానిని. ఆయన నిర్మొహమాటం ,ఆయన విషయ పరిజ్ఞానం, ఆయన రాసే తెలుగు భాషా, ఆయన ఇతరుల కంటే విభిన్నం సుమా అని చెబుతున్నట్టుండేది. నాకాయన పరిచయమవుతారనీ, ఆయనతో మాట్లాడతాననీ, ఆయన పుస్తకం ప్రచురించిన మొట్ట మొదటి ప్రచురణ కర్తని నేనే అవుతాననీ(రెండో ప్రచురణ కర్త నా స్నేహితురాలు డా"శశికళ కోలా ) ఆయన మా ఇంటి సభ్యులలో ఒకరిలా అవుతారనీ పదహారేళ్లక్రితం ఊహామాత్రంగా కూడా అనుకోలేదు .అంతా "కృష్ణమాయ "అనిపించేట్టే జరిగింది. ఈ జన్మలో నాకు పట్టిన అదృష్టాలలో అదొకటి. 2002లో "వార్త" లో వస్తున్న కాలమ్ "ఆలాపన "అభిమానిగా ఆయనతో పరి...

మమతల పాలవెల్లి మా అమ్మ

Image
నేను కళ్లు తెరిచేటప్పటికి ఆమె వొడి లోవున్నాను అప్పటినుండీ ఆమె కళ్లు మూసే వరకూ ఆ వొడిలోనే భద్రంగా వున్నాను ఆ తర్వాతే హఠాత్తుగా నా వయసూ , నా పెద్దరికం నాకు తెలిసింది. ఆమె నా కన్నతల్లి కాదనీ "పెద్దమ్మా " అని పిలవాలని నాకూ, నేను తన కన్నకూతురిని కాదనీ కాస్త వేరుగా చూడాలనీ ఆమెకూ యెవరెన్ని సార్లు గుర్తు చేసినా యిద్దరం ఆ విషయం అంగీకరించలేదు నేనే కాదు నా కొడుకు కూడా ఆమెనే "అమ్మా "అని పిలిచేది. నన్ను పెంచిన ఆరేళ్లకి పుట్టిన కూతురు కన్నా తనకు నేనే యెక్కువ . లంకంత కొంపలో పదమూడేళ్ల పసి వయసులో యింటికి పెద్దకోడలుగా అడుగు పెట్టి వంచిన నడుమెత్తకుండా చాకిరీ చేసి అత్త మామలకు ప్రీతి పాత్రమయిన కోడలుగా మెలిగింది. ఆడబడుచుల ఆరళ్లు తట్టుకుని నిలబడింది మరుదులందరికీ మాతృమూర్తిలాంటి వదినగా వెలిగింది  యెంత వయసొచ్చినా యిరుగు పొరుగుకే కాక యింటికెవరొచ్చినా చూడంగానే యిష్టపడే మూర్తిమత్వం మొక్కలనీ, కుక్కలనీ, పశువులనీ, పక్షులనీ, మనుషుల్లాగే ప్రేమించే మనస్తత్వం. నియంతలాంటి భర్తతో మెప్పూ,మెహర్బానీ లేని కాపురం యేభై యేళ్లు వెలిగించినా తన పుట్టిన రోజెపుడో పెళ్లి రోజెపుడో యెరగదు.  మావే కానీ తన...

గాన సావిత్రి

Image
సావిత్రి మంచినటిగా మనందరికీ తెలిసిన విషయమే ,చిన్నప్పటి నుండీ ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగిన నేను ఆవిడలోని మంచి డాన్సర్ ని కనిపెట్ట లేకపోయాను . అందుకే ఆవిడ జీవిత చరిత్ర చదివి నపుడు డాన్సర్ గా ఆవిడ కళా జీవితం ప్రారంభ మయిందనీ కాకినాడ కళా పరిషత్తులో ఆవిడ చేసిన నాట్యానికి మంచి గుర్తింపు వచ్చిందనీ,పృథ్వీరాజ్ కపూర్ కూడా మంచి ఫుట్ వర్క్ అని ప్రశంసించారనీ చదివిఆశ్చర్య పోయాను.ఆ నాట్యం చూసే దోనేపూడి కృష్ణమూర్తి అనే ఆయన మొదట సినిమా ఛాన్స్ ఇచ్చారనీ ఆవిడ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఆవిడ చక్కగా శృతిశుధ్ధంగా పాడటం.ఎక్కడంటారా? -"మిస్సమ్మ" సినిమాలో "మీకు మీరే మాకు మేమే "అంటూ స్వరాలతో సహా అక్కినేని తో గొంతు కలిపిందికదా!.అసలా గొంతు ఆవిడకి ఆ చిత్రంలో ప్లేబాక్ పాడిన లీలదనుకున్నాను ,వి.ఎ.కె చేసిన "మిస్సమ్మ "సంక్షిప్త శబ్ద చిత్రం క్రెడిట్స్ లో ఆమె పేరు ఇవ్వడం వలనా ,ఆయన నాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం వలనా తెలిసింది.ఆవిడ "నవరాత్రి" వీధి భాగవతంలో కూడా పాడింది,అందులో పాడటానికి వి.ఏ.కె. ఆ చిత్ర బృందానికి "ఆవిడ బాగా పాడుతుంది,వెరై...