గాన సావిత్రి


సావిత్రి మంచినటిగా మనందరికీ తెలిసిన విషయమే ,చిన్నప్పటి నుండీ ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగిన నేను ఆవిడలోని మంచి డాన్సర్ ని కనిపెట్ట లేకపోయాను . అందుకే ఆవిడ జీవిత చరిత్ర చదివి నపుడు డాన్సర్ గా ఆవిడ కళా జీవితం ప్రారంభ మయిందనీ కాకినాడ కళా పరిషత్తులో ఆవిడ చేసిన నాట్యానికి మంచి గుర్తింపు వచ్చిందనీ,పృథ్వీరాజ్ కపూర్ కూడా మంచి ఫుట్ వర్క్ అని ప్రశంసించారనీ చదివిఆశ్చర్య పోయాను.ఆ నాట్యం చూసే దోనేపూడి కృష్ణమూర్తి అనే ఆయన మొదట సినిమా ఛాన్స్ ఇచ్చారనీ ఆవిడ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు.

నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఆవిడ చక్కగా శృతిశుధ్ధంగా పాడటం.ఎక్కడంటారా? -"మిస్సమ్మ" సినిమాలో "మీకు మీరే మాకు మేమే "అంటూ స్వరాలతో సహా అక్కినేని తో గొంతు కలిపిందికదా!.అసలా గొంతు ఆవిడకి ఆ చిత్రంలో ప్లేబాక్ పాడిన లీలదనుకున్నాను ,వి.ఎ.కె చేసిన "మిస్సమ్మ "సంక్షిప్త శబ్ద చిత్రం క్రెడిట్స్ లో ఆమె పేరు ఇవ్వడం వలనా ,ఆయన నాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం వలనా తెలిసింది.ఆవిడ "నవరాత్రి" వీధి భాగవతంలో కూడా పాడింది,అందులో పాడటానికి వి.ఏ.కె. ఆ చిత్ర బృందానికి "ఆవిడ బాగా పాడుతుంది,వెరైటీ గా వుంటుంది పాడిస్తే "అని చెప్పడం కారణమట --ఆయనే చెప్పారు స్వయంగా మరి ఒక సారి చూద్దామా సావిత్రి గాన కళా కౌశలం.
https://www.youtube.com/watch?v=6QYHOjm4pCc&feature=youtu.be&fbclid=IwAR2knlptl1XUOIXAKpumD3a0-5NnL3ZUE7NYZ-QpYqYLOnCzJNJa48gYET0

https://www.youtube.com/watch?v=ojDyt19Ecr8&feature=youtu.be&fbclid=IwAR3GoYPn89OHVZTfjF7X-q6d2KhMX1ZDkE7QbxTE7s_9KTaH3siETBrP-50

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము