Posts

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

Image
  ఆ గొంతు వింటే "జననాంతర సౌహృదాని" అనే మాట గుర్తొస్తుంది,జన్మజన్మలుగా నేనెరిగిన గొంతు అనిపిస్తుంది.నేనింకా పూర్తిగా కళ్లు తెరవక ముందే రేడియోలోంచి వచ్చే పాటలలో వినబడి మెత్తగా, మధురంగా వెంటాడిందీ గొంతే అని తెలుసుకున్నది మాత్రం యవ్వనంలో అడుగు పెడుతున్న కొత్తల్లో హిందీ పాటల వెల్లువలో కొట్టుకు పోయేటపుడు ఇదంతా ఇంకెవరి గురించీ గొంతు విప్పితే చాలు వినే వారి మనసులను మధురమయిన లయలో కరిగించి పూలదారులలో ,తేనె వాకలలో తేలించే మహ్మద్ రఫీ గురించే ఇక్కడో చిన్న ముచ్చట నా అజ్ఞానం గురించి 9వక్లాసులో వున్నప్పుడనుకుంటా నేనూ,నా స్నేహితురాలూ మాటాడుకుంటూ నీ అభిమాన గాయకుడెవరంటే నీ అభిమాన గాయకుడెవరూ అని ప్రశ్నించుకున్నాం.నా స్నేహితురాలు మహ్మద్ రఫీ పేరు చెప్పింది నేను వెంటనే యేదీ తెలుగులో "ఎంత వారుగానీ వేదాంతులైన గానీ" అని పాడాడేఅయ్యో ఆయనా అని ఆమెను చూసి జాలి పడ్డాను .అప్పుడు తెలియదు నాకు ముందుంది ముసళ్ల పండగ అనీ"రఫీ" అనే మోహ సముద్రంలో నేను మునిగి పోబోతున్నాననీ. నేనూ నాస్నేహితురాలు మృణాళినీ కూడా గాఢమయిన రఫీ అభిమానులం .మేమిద్దరం కలసినపుడు తన చిన్నప్పటి సంఘటన చెప్పుకుని నవ్వుకుంటాం అద...

మరణానంతరము

Image
  నేను ఈ నవల 1991 లో విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కొన్నాను.కొన్న వెంటనే చదివేశాను(అప్పట్లో దాదాపు నా దగ్గరున్న పుస్తకాలన్నీ నేను చదివినవే అయి వుండేవి,ఇప్పుడయితే నా కలెక్షన్లో నేను చదవనివి కనీసం వంద పుస్తకాలుండొచ్చు),సెల్ ఫోన్లూ ఫేస్ బుక్ లూ లేని కాలంకదా.నవల చదివిన దగ్గరనుండీ అది నన్ను వెంటాడుతూనే వుంది,ఆ నవల చదివి దాదాపు ముఫ్ఫయ్యేళ్లు దాటినా అది నా జ్ఞాపకాల పుటలనుండీ చెరిగిపోలేదు. ఇంతకీ ఈ పుస్తకం కన్నడం నుండీ తెలుగులోకిఅనువదింపబడింది.కన్నడంలో దాని పేరు "అళిదమేలె",తెలుగులో శ్రీ తిరుమల రామచంద్ర "మరణానంతరము" అనే పేరుతో అనువదించారు.నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 1972 లో ప్రచురించినట్టు వుంది, రచయిత కె.శివరామ కారంత రాసిన ముందు మాట వలన దీని రచనా కాలం 1960 అని తెలుస్తోంది,అంటే కన్నడంలో ప్రచురించ బడిన పన్నెండేళ్లకి NBT వారి అనువాదం వచ్చిందన్న మాట. అరవయ్యేళ్ల క్రితం రాసిన పుస్తకమయినా ,తీసుకున్న కథావస్తువు వలన అది ఎప్పటికయినా చదవడానికి ఉచితమైన పుస్తకమే అనిపిస్తుంది. రచయిత శివరామ కారంత ,ఉత్తమ పురుషలో అంటే తానే కథలో పాత్రధారిగా వుంటూ ,తన గొంతులోనే కథ చెబుతారు---- కారంత గారికి బొంబాయివెళ...

విలక్షణ స్వరం---పిఠాపురం

Image
  "అయ్యోయ్యో చేతిలో డబ్బులు పోయెనే జేబులు ఖాళీ ఆయెనే"-----కులగోత్రాలు "మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు."----అవేకళ్లు "సోడా సోడా ఆంధ్రా సోడా గోలీ సోడా జిల్ జిల్ సోడా సోడా తాగు తెలుగోడా చల్లని సోడా,దీని మహిమ చెప్ప లేడు దేవుడు కూడా"-----లక్ష్మీనివాసం "సైకిల్ పై వన్నెలాడి పోతున్నదీ రయ్యిమని పిట్టలాగ పోతున్నది"----పిన్ని "పొరుగింటి మీనాక్షమ్మను చూశారా వాళ్ల ఆయన చేసే ముద్దుముచ్చట విన్నారా"---సంబరాల రాంబాబు "మాయా సంసారం తమ్ముడూ నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడూ"---ఉమా సుందరి "అరె నిసగమపా ఈ లోకం మోసం పమగరిసా"----జయసింహ ఈ పాటలన్నిటిలో వినపడే ఒక ప్రత్యేకమైన గొంతుని గుర్తుపట్టారా?అది పిఠాపురం నాగేశ్వరరావుది. మనకున్న నేపథ్య గాయకులలో విలక్షణమైన, ప్రత్యేకమైన స్వరం పాతర్ల గడ్డ నాగేశ్వరరావుది,ఇలా అంటే యెవ్వరికీ తెలియదు,పిఠాపురం అంటేనే తెలుస్తుంది.ఊరి పేరునే ఇంటి పేరు చేసుకున్న గాయకుడు. నిజానికి యే గొంతు కా గొంతు ప్రత్యేకమైనదే,యే గొంతులో వుండే అందం ఆ గొంతులో వుంటుంది. అయితేఇంతకీ యేమ...

జై యన్ .టి.ఆర్

Image
ఏ కోణం నుండీ చూసినా,యే ఫీచర్ చూసినా అందంగానే వుండి ఆకట్టుకునే దివ్యమంగళ విగ్రహం.అలాంటి తీరైన ,ఆకర్షణీయమైన రూపం తెలుగుతెర మీద అంతకు ముందు రాలేదు,ఇకముందు వస్తుందనే ఆశ లేదు.తన కుటుంబంలో కూడా ముందు తరాలలోనూ,ఇప్పటికి వరకూ వచ్చిన వారిలోనూ అంత అందం,ఠీవీ,రాజసం కనరాదు. ఈ పాటికి ఈ ఉపోద్ఘాతమంతా యెవరి గురించో ఊహించే ఉంటారుగా ,ఇంకెవరూ ఈనాడు జన్మించి తెలుగుతెర కథానాయకుడు గానే కాదు,తెలుగుదేశం నాయకుడిగా కూడా వెలిగిన నందమూరి తారకరామారావు గారి గురించే. వీరు మా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో వున్న నిమ్మకూరు లో జన్మించడం వలన ,చిన్నప్పటి నుండీ వీరి కబుర్లు యెవరో ఒకరు చెబుతూ వుండేవారు,పామర్రులో కొన్నాళ్లు నివాసం వున్నారని చెప్పేవారు నిజమెంతో నాకు తెలియదు ఊహ తెలిశాక ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం,అందుకే ఆయన గొప్పతనం కాస్త ఆలస్యంగా తెలిసిందేమో అనుకుంటా. నా జీవితంలో ఆయనను రెండు సార్లు చూసే అవకాశం కలిగింది. నేనప్పుడు యేడో క్లాసు చదువుతున్నాను 1969వ సంవత్సరమనుకుంటా,నేను మా దొడ్లో వున్న జామ చెట్టెక్కి కాయలు కోసుకుంటున్నా యథాప్రకారం(ఇంటి దగ్గర వున్నప్పుడు నా కేరాఫ్ అడ్రస్ అదే ),ఇంతలో యెవరో యం.టీ .రామారావొచ్చాడు మనూరి...

ఔను నిజం ప్రణయ రథం

Image
ఆ రోజు సాయంత్రం ఇంట్లో అందరం కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాం,హఠాత్తుగా టాపిక్ సినిమాల మీదకు మళ్లింది,ఉన్నట్టుండి మా నాలుగో బాబాయి అడిగాడు "మీలో ఎవరైనా జింబో సినిమా చూశారా?" అనిమేమందరం లేదంటే లేదన్నాం. ఇదంతా ఎప్పుడంటే అబ్బో 1972-73 లో మాట,అప్పుడు నేను బెజవాడ KBN కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతూ వన్ టౌన్ లో మా మూడో బాబాయి గారింట్లో వుంటూ మధ్యలో ఏదో శెలవు రోజున గట్టు వెనక వుంటున్న (బెజవాడలో కనక దుర్గ కొండ వెనక ప్రాంతం) మా నాలుగో బాబాయి గారింటి కొస్తే,అక్కడ జరిగిన ముచ్చట ఇది. ఏవిటీ మూడో బాబాయి,నాలుగో బాబాయి అంటున్నావు?అసలెంతమందీ ఏంకథా ?అనుకుంటున్నారా?చెబుతా నాకు మొత్తం ఆరు బాబాయిలుండేవిలే ,మానాన్న ,పెదనాన్నకాక,ఇప్పుడు మాత్రం ఒక్కటే వుందనుకో! మా ఐదో బాబాయిది అదో తరహా,ఆయన మాటల ధోరణికి మా పిల్లలందరం పడీ,పడీ నవ్వుతూ వుండేవాళ్లం.గులాబీ పువ్వుని"గుల్పాతీ పువ్వు "అనేవాడు," సినిమాలలో వచ్చే సంభాషణలనయితే తమాషాగా నవ్వొచ్చేట్టు మార్చి చెప్పేవాడు"జై పాతాళ భైరవి"అనే దాన్ని "జై తపేళా భైరవి"అనే వాడు,ఇంకా మాయా బజార్లో పద్యాన్ని మార్చి "అటు ఇద్దరు ఇటు ఇద్దరు ...

కొకైన్ కింగ్ --పాబ్లో ఎస్కొబార్

Image
మనిషి ఆశాజీవి,భవిష్యత్తు మీద ఆశే అతన్ని ముందుకు నడిపే ఇంధనం.అంతేకాదు  జీవితంలో యెన్నో సాధించాలనే కలలు కనడం,ఆ కలలని నిజం చేసుకోవడానికి యెంతో శ్రమించడం ,యెత్తులకి పై యెత్తులు వెయ్యడం, జిత్తులుచెయ్యడం ఇదంతా మనిషి జీవితంలో  ఒక భాగం.కానీ ఆ ఆశ దురాశ కాకూడదు,ఉన్నతంగా జీవించాలని కలలు కనడం తప్పుకాదు కానీ ,ఆ కలలు తీర్చుకోడానికి యెన్నుకునే మార్గాలు సరైనవి కాకపోతే అవే అతని వినాశనానికి కారణమవుతాయి. అందుకే "యెంత విభవము గలిగిన అంతయును ఆపద"అనీ,"దురాశ దుఃఖమునకు చేటు" అనీ పెద్దలు చెప్పిన మాటలు  మరిచి పోగూడదు. అవినూటికి నూరుపాళ్లూ నిజాలని మనకి నిరూపించే ఉదాహరణలుగా కొంత మంది జీవితాలుండటంకూడా ఆశ్చర్యంగా వుంటుంది. అలాంటి జీవితమే కొకైన్ కింగ్  గా పిలవబడే పాబ్లో ఎస్కొబార్ ది.అతను 1980-90సంవత్సరాల మధ్యలో మాదక ద్రవ్యాల మహాసామ్రాజ్యానికి మకుటం లేని రారాజుగా వెలిగిపోయాడు.అమెరికాకు  అక్రమంగా రవాణా అయ్యే  కొకైన్ లో యనభై శాతం ఎస్కోబార్ ద్వారానే సరఫరా అయ్యేది.రోజుకి సుమారు పదిహేను టన్నుల కొకైన్ రవాణా అయ్యేది.ఇలా రవాణా చెయ్యడానికి అతను  142 విమానాలను,20హెలికాప్టర్లను,32యాక్ట్ లు,141ఆఫ...