మా తాతయ్య
ఈ ఫోటోలో ఉన్నాయన పేరు రొంపిచర్ల చిన శేషాచార్యులు,ఈయన మా నాన్నకు నాన్న అంటే నాకు తాత,ఈ మధ్య ప్రముఖ ఆర్టిస్ట్ బి.ఏ. రెడ్డి గారు ఈయన ఫోటో ఫేస్ బుక్ లో పెట్టమని అడిగారు ,అప్పుడు మా తాతయ్య గురించి నాకు తెలిసిందీ,మా పెదనాన్న చెప్పగా విన్నదీ కాక నాకు ఇప్పుడున్న ఒకే ఒక సోర్సు మా ఆఖరి బాబాయి ప్రభాకర నారాయణా చార్యుల నడిగి తెలుసుకుని ఇది రాస్తున్నాను. మా తాత యేమన్నా మహాత్మా గాంధీ లాగా దేశాన్ని ఉధ్ధరించే పనులు చేశాడా?సంఘ సంస్కర్త వీరేశ లింగం లాగానో ,మరెవరి లాగానో యేమైనా సంస్కరణలు తీసుకొచ్చాడా అంటే అదేమీ లేదు గానీ,చిన్నతనం లోనే ,ఆరుగురు బిడ్డలనీ ,భార్యనీ ఒంటరి వాళ్లను చేసి తండ్రి చనిపోతే ఇంటికి పెద్ద కొడుకుగా ఆ కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుని పేదరికంలో మగ్గుతున్న కుటుంబాన్ని ఒక దోవకు తీసుకువచ్చి ,ఇల్లూ ,వాకిళ్లూ ,పొలాలూ యేర్పరుచుకుని,తోబుట్టువులకు కూడా యేలోటూ లేకుండా చేసి,ఊళ్లో ప్రజలకు ఆయుర్వేద వైద్యుడిగా సేవలందిస్తూ తలలో నాలుకలా మెలిగిన వ్యక్తి.అసలు ఇవన్నీ లేకపోయినప్పటికీ మన మూలాల గురించి మనం తెలుసు కోవలసిన అవసరం వుంది.మన వేరుల గురించి మనం సిగ్గు పడాల్సింది లేదు,కాయకష్టం చేసే వాళ్ల దగ్గరనుం...